రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దౌసా జిల్లాలో ట్రక్కు, జీపు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను మహువా, మాండవర్ ఆస్పత్రులకు తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా వుంది.
మెరుగైన చికిత్స నిమిత్తం ఆ నలుగురిని జైపూర్ ఆస్పత్రికి తరలించారు. ఉక్రుంద్ గ్రామంలో కూల్ డ్రింక్స్ లోడ్ తో వస్తున్న జీపు, ప్రయాణికులతో వస్తున్న ట్రక్కు ఒక దానికి ఒకటి ఢీ కొన్నాయన్నారు. దీంతో ట్రక్కు బోల్తా కొట్టిందన్నారు. దీంతో ట్రక్కులోని నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారని పేర్కొన్నారు. ప్రమాదాన్ని గమనించి స్థానికులు తమకు సమాచారం అందించారన్నారు.
వెంటనే అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టామన్నారు. క్షతగాత్రులను మథువా, మాండవర్ ఆస్పత్రులకు తరలించామన్నారు. అందులో నలుగురికి మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో జైపూర్ కు తరలించామన్నారు. ఈ ఘటనపై స్థానిక ఎంపీ రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
మాండవర్ ప్రాంతంలో ఆరుగురి అకాల మరణ వార్త విని తాను తాను కలత చెందానన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించానన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.