Hyderabad : రాజాసింగ్ బెదిరింపుల కేసు.. నిందితుడిని గుర్తించిన పోలీసులు

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కువైట్ లో ఉంటున్న చంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ ఖాసిం ఇంటర్నెట్ కాల్స్ ద్వారా ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలిపారు.

Hyderabad : రాజాసింగ్ బెదిరింపుల కేసు.. నిందితుడిని గుర్తించిన పోలీసులు
New Update

MLA Raja Singh Threat calls: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్  బెదిరింపుల కేసులో నిందితుడిని గుర్తించారు పోలీసులు. ఇటీవల వచ్చే శ్రీరామ నవమి రోజున తనను చంపేస్తామంటూ విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజాసింగ్. అయితే ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఇందుకు పాల్పడిన వ్యక్తిని గుర్తించినట్లు తెలిపారు.

కువైట్ నుంచి మహమ్మద్ ఖాసిం..

ఈ మేరకు కొంతకాలంగా కువైట్ (Kuwait) లో ఉంటున్న మహమ్మద్ ఖాసిం అనే వ్యక్తి ఈ చర్యకు పాల్పడ్డట్లు వెల్లడించారు. చంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ ఖాసిం 14 ఏళ్లు కిందట దుబాయ్ కి వెళ్లి అక్కడి నుంచి కువైట్ వెళ్లి అక్కడే సెటిల్ అయినట్లు చెప్పారు. ఇక మమ్మద్ ఖాసిం కోసం ఎల్ఓసి నీ జారీచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా ఖాసింను పట్టుకున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి : Sita Rama Project : సీతారామ ప్రాజెక్టులోనూ మేఘా కృష్ణారెడ్డి భారీ దోపిడి

శోభ యాత్ర టార్గెట్..

ఇక గతంలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఇప్పటికే డీజీపీ, సీపీలకు పలుసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని రాజాసింగ్ ఆరోపించారు. వివిధ నంబర్లనుంచి చాలాసార్లు ఫోన్స్ వచ్చాయని, ఆడియో రికార్డులు కూడా పోలీసులకు అందజేశానని రాజాసింగ్ చెబుతున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, తదితర ప్రాంతాలనుంచి ఫోన్లు వచ్చినట్లు ఫిర్యాదు చేశారు. మతాన్ని రెచ్చెగొడుతున్నానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, వచ్చే ఏడాది శ్రీరామ నవమి శోభ యాత్రలో చంపేస్తారంటున్నట్లు రాజాసింగ్ (MLA Raja Singh) వాపోయారు.

అలాగే ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు లుకావ్ నిందితుడికి నోటీసులు జారీ చేశారు. అయితే అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని కువైట్ పంపిస్తారా? లేక ఖాసిం ఇండియాకు రాగానే అరెస్ట్ చేస్తారా? అనే విషయం తెలియాల్సివుంది.

#hyderabad #mla-raja-singh #kuwait
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe