SSMB29 : మహేష్ కు యాక్టింగ్ క్లాసులు.. నేర్పించేది ఎవరో తెలుసా?

'SSMB29' ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్, ఇతరత్రా వర్క్ అంతా జరుగుతోంది. ఇందులో భాగంగానే మూవీలో మహేశ్ బాబు పాత్ర యాస, యాక్టింగ్ విషయంలో ప్రముఖ సీనియర్ నటుడు నాజర్ మెలకువలు నేర్పిస్తున్నారట. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

New Update
SSMB29 : మహేష్ కు యాక్టింగ్ క్లాసులు.. నేర్పించేది ఎవరో తెలుసా?

Rajamouli - Mahesh Babu Movie Latest Update : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చేసుకున్న మహేష్.. ఫిజిక్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా వెకేషన్ కోసం ఫారిన్ టూర్ వెళ్లిన ఈ హీరో.. ఇటీవలే హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. అటు రాజమౌళి సైతం ప్రీ ప్రొడక్షన్‌లో బిజీ అయిపోయాడు.

ఈ క్రమంలోనే మహేశ్ కొత్తగా కొన్ని విషయాల్లో మారేందుకు రెడీ అయిపోతున్నాడనే న్యూస్ బయటకొచ్చింది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్, ఇతరత్రా వర్క్ అంతా జరుగుతోంది. ఇందులో భాగంగానే మూవీలో మహేశ్ బాబు పాత్ర యాస, యాక్టింగ్ విషయంలో నాజర్ మెలకువలు నేర్పిస్తున్నారట. అంటే రాజమౌళి ప్రాజెక్ట్ కోసం సరికొత్త మహేశ్‌ని చూడబోతున్నమాట. మరోవైపు #SSMB 29 గురించి రాజమౌళి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి సినిమాకు సంబంధించి పలు విషయాలను చెప్పనున్నట్లు తెలుస్తోంది.

Also Read : ‘మనసంతా నువ్వే’ డైరెక్టర్ కొత్త సినిమా.. డల్లాస్ లో ఆడిషన్స్ కి విశేష స్పందన!

కాగా ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై సీనియర్ నిర్మాత కే.ఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా 2026 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు