Raj Tarun - Lavanya : లావణ్య డెడ్ బాడీని మాయం చేస్తా.. మాల్వీ మల్హోత్రా సంచలన వార్నింగ్?

రాజ్‌తరుణ్, లావణ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. తాజాగా లావణ్య తల్లిదండ్రులు ఆమెకు మద్దతుగా నిలిచారు. 'తన కూతురిని చంపి డెడ్‌బాడీ మాయం చేస్తానని మాల్వి మల్హోత్రా ఫ్యామిలీ బెదిరిస్తోందని, తన కూతురికి ఏం జరిగినా మాల్విదే బాధ్యత" అని లావణ్య తండ్రి పేర్కొన్నాడు.

New Update
Raj Tarun - Lavanya : లావణ్య డెడ్ బాడీని మాయం చేస్తా.. మాల్వీ మల్హోత్రా సంచలన వార్నింగ్?

Raj Tarun - Lavanya Case : రాజ్‌తరుణ్ (Raj Tarun), లావణ్య (Lavanya) వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. 2014లో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడనీ, అబార్షన్ కూడా చేయించాడని, రాజ్‌తరుణ్‌కు తాను 70 లక్షలు సైతం ఇచ్చినట్టు లావణ్య పోలీసులకు పిర్యాదు చేస్తూ రాజ్ తరుణ్ తనకు చేయించిన అబార్షన్‌ మెడికల్‌ డాక్యుమెంట్స్ ను పోలీసులకు అందజేసింది. దీంతో రాజ్‌తరుణ్‌పై 420, 506, 493 సెక్షన్ల కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక ఈ విషయంలో లావణ్య తల్లిదండ్రులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ మేరకు లావణ్య తండ్రి రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా (Malvi Malhotra) పై సంచలన ఆరోపణలు చేశాడు." రాజ్‌తరుణ్‌ నా కూతుర్ని పెళ్లి చేసుకుని.. గర్భవతిని చేసి మోసం చేశాడు. తప్పు ఒప్పుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి.. అతను నా కూతురికి రేటు కడుతున్నాడు.

Also Read : మరో లగ్జరీ ప్లాట్ కొన్న ప్రభాస్ హీరోయిన్.. ఎన్ని కోట్లో తెలుసా?

నాకు డబ్బులు అవసరం లేదు. నా కూతురికి న్యాయం చేసేందుకు నా ఆస్తి మొత్తం అమ్ముతా. న్యాయం జరిగే వరకు రాజ్‌తరుణ్‌ను విడిచి పెట్టేది లేదు. మాల్వి మల్హోత్రా ఒక చీడ పురుగు. నా కూతురిని చంపి డెడ్‌బాడీ మాయం చేస్తానని మాల్వి మల్హోత్రా ఫ్యామిలీ బెదిరిస్తోంది. నా కూతురు లావణ్యకు ఏం జరిగినా రాజ్‌తరుణ్‌, మాల్విదే బాధ్యత" అని పేర్కొన్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు