Kriti Sanon : మరో లగ్జరీ ప్లాట్ కొన్న ప్రభాస్ హీరోయిన్.. ఎన్ని కోట్లో తెలుసా? 'ఆదిపురుష్' హీరోయిన్ కృతి సనన్ తాజాగా మరో లగ్జరీ ప్లాట్ కొనేసింది. ముంబైలోని అలీబాగ్ ప్రాంతంలో 2000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్న ప్లాట్ కోసం కృతి సనన్ రెండు కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మొన్నే అమితాబ్ బచ్చన్ కూడా ఇదే ఏరియాలో ప్లాట్ కొన్నాడు. By Anil Kumar 12 Jul 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Actress Kriti Sanon Buys A Luxury Flat : టాలీవుడ్ (Tollywood) లో వన్ నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కృతి సనన్ (Kriti Sanon).. ప్రస్తుతం బాలీవుడ్ (Bollywood) లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. గత ఏడాది ప్రభాస్ సరసన 'ఆదిపురుష్' తో సీతమ్మగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సక్సెస్ అందుకుంది. కృతి సనన్ రీసెంట్ టైమ్స్ లో నటించిన 'తేరే బాతోన్ మే ఐసా ఉల్జా జియా', 'క్రూ' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నాయి. Also Read : రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిన ‘కల్కి’.. ప్రభాస్ కెరీర్ లోనే అరుదైన రికార్డ్! ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న కృతి.. గతేడాది రూ.35 కోట్లతో బంగళా, రెండు ఫ్లాట్స్ కొనుగోలు చేసింది. ఇక తాజాగా మరో లగ్జరీ ప్లాట్ కొనేసింది. ముంబై (Mumbai) లోని అలీబాగ్ ప్రాంతంలో 2000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్న ప్లాట్ కోసం కృతి సనన్ రెండు కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మొన్నే అమితాబ్ బచ్చన్ కూడా ఇదే ఏరియాలో ప్లాట్ కొన్నాడు. ఇప్పుడు అక్కడే కృతి సనన్ ప్లాట్ కొనడం విశేషం. #bollywood #tollywood #luxury-flat #kriti-sanon-buys-new-flat #actress-kriti-sanon మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి