ఝార్ఖండ్‌లో భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో అరెస్టయిన మాజీ సీఎం హేమంత్ సోరెన్ సోమవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించారు. గత నెల జనవరి 31న ఈడీ అధికారులు తనను అరెస్టు చేశారని.. ఇది చీకటి అధ్యాయమని అన్నారు. పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి అరెస్టు రావడం దేశంలో ఇదే మొదటిసారని తెలిపారు. నా అరెస్టు వెనుక రాజ్‌భవన్ ప్రమేయం ఉందని తాను గట్టిగా నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు.
బలపరీక్ష ఎదుర్కొనున్న చంపాయ్ సోరెన్
అయితే మరికొద్దిసేపట్లో.. నూతన సీఎం చంపాయి సోరెన్ నేతృత్వంలో ఝార్ఖండ్ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ క్రమంలోనే రాంచి కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో.. అరెస్టయిన హేమంత్ సోరెన్ ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు. మనీలాండరింగ్ కేసులో జనవరి 31న రాత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జేఎంఎం పార్టీ ఉపాధ్యాక్షుడు చంపాయ్ సోరెన్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read: పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి.. 10 మంది పోలీసులు మృతి..
దీంతో 10 రోజుల్లోనే రాష్ట్ర అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్‌కు ఆదేశించారు. ఆ తర్వాత తన ప్రభుత్వంలోని మంత్రులతో చంపాయ్ సోరెన్ క్యాబినేట్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 5, 6వ తేదీల్లో అసెంబ్లీలో స్పెషల్ సెషన్ నిర్వహించాలని.. 5వ తేదీ బలపరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
చంపాయ్ సోరెన్ గెలుస్తారా
ఈరోజు చంపాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఫ్లోర్ టెస్టును ఎదుర్కోబోతుంది. ఇటీవల తనకు మద్ధతు తెలిపేందుకు 40 మంది ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీలో హేమంత్ సోరన్ నా అరెస్టు వెనుక రాజ్‌భవన్ ప్రమేయం ఉందని చెప్పడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. మరీ ఫ్లోర్‌టెస్ట్‌లో చంపయ్ సోరెన్ నెగ్గుతారా లేదా అనేది తెలియాలంటే.. మరికొంతసేపు ఆగాల్సిందే.
Also Read: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో సీఐ దుర్గారావు అరెస్ట్