Telangana: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలే వానలు!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరంగా విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది.

New Update
Weather Alert: ఈ నెల 12 వరకు భారీ వర్షాలు

Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరంగా విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. జూన్‌ 5న మహబూబ్‌ నగర్‌ లో ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్నాయి.

ఈ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ పేర్కొంది. మంగళవారం ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి రుతుపవనాల విస్తరణ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశలున్నట్లు అధికారులు వివరించారు.

బుధ, గురువారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఇక గురువారం హైదరాబాద్‌, మేడ్చల్‌ మలాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ ,హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది.

మూడు రోజులపాటు వాతావరణశాఖ కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీట ర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ మంగళవారం వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Also read: దేశాధ్యక్షుడిని అయినా నేనూ తండ్రినే..జోబైడెన్

Advertisment
తాజా కథనాలు