Telangana: తెలంగాణలో మరో రెండు రోజులు వానలే..వానలు!

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల గురించి తెలిసిందే. ప్రతి రోజూ జల్లులు కురుస్తున్న క్రమంలో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో కురవనున్నట్లు హైదారాబాద్‌ వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

Telangana: తెలంగాణలో మరో రెండు రోజులు వానలే..వానలు!
New Update

Rain Alert For Telangana: తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల గురించి తెలిసిందే. ప్రతి రోజూ జల్లులు కురుస్తున్న క్రమంలో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో కురవనున్నట్లు హైదారాబాద్‌ వాతావరణశాఖ (Hyderabad IMD) మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సముద్ర మట్టానికి 7.6 కి. మీ ఎత్తు వరకు ఆవర్తనం ఉందని... ఈ ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాజన్న- సిరిసిల్ల, వరంగల్‌, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, మంచిర్యాల, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ ప్రాంతాల్లో ఈదురుగాలుల‌తో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాలకు అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: ఢిల్లీలో వరదలు..ముగ్గురు విద్యార్ధులు మృతి

#hyderabad #telangana #rain-alert
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe