Rain Alert : రాష్ట్ర వ్యాప్తంగా రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు!

రాగ‌ల 24 గంట‌ల్లో తెలంగాణలో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నట్లు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది. ఉరుములు, మెరుపుల‌తో పాటు గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశాలు కూడా ఉన్నట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

New Update
Rains: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తూఫాన్ ఎఫెక్ట్..!

Telangana : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) విస్తారంగా విస్తారించాయని వాతావరణ శాఖాధికారులు (IMD) తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని అధికారులు పేర్కొన్నారు. జూన్‌ 5న మహబూబ్‌నగర్‌ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయని ఐఎండీ వివరించింది.

రాగ‌ల 24 గంట‌ల్లో రాష్ట్రంలో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు (Rains) కురిసే అవ‌కాశం ఉన్నట్లు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది. ఉరుములు, మెరుపుల‌తో పాటు గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశాలు కూడా ఉన్నట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు. బుధవారం ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్‌, ఖమ్మం, మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణశాఖాధికారులు వివరించారు.

ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులలాంబ గద్వాల జిల్లాల్లో గురువారం, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌భూపాలపల్లి,పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండ, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Also read: కూరగాయల రెక్కలకు ధరలు..మళ్లీ పెరగనున్న టమాటా, ఉల్లి ధరలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు