/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-2.jpg)
Rains In Telangana : తెలంగాణ (Telangana) లో గత రెండు రోజులుగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో నాలుగురోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నట్లు ఐఎండీ (IMD) అధికారులు వివరించారు. నగరంలోని అల్వాల్, కంటోన్మెంట్, ఉప్పల్, ఎల్‌బీ నగర్, చాంద్రాయణగుట్ట, రాజేంద్ర నగర్, కార్వాన్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో మబ్బులు విపరీతంగా పట్టడం వల్ల భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.