Kalki : ప్రభాస్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీఛార్జ్..! కల్కి సినిమాలకు బెనిఫిట్ షో లకు అభిమానులు పోటెత్తడంతో పోలీసులకు వారిని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఓ థియేటర్ వద్ద అభిమానులు మితీమిరి ప్రవర్తించడంతో పోలీసులు ప్రభాస్ అభిమానుల మీద లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. By Bhavana 27 Jun 2024 in సినిమా తెలంగాణ New Update షేర్ చేయండి Kalki Movie : దేశ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసిన కల్కి 2898 ఏడీ (Kalki 2898AD) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కల్కి ఫీవర్ ఎలా ఉంటుందో టికెట్ల బుకింగ్ లోనే తెలిసింది. సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతుందని తెలిసిన ప్రభాస్ అభిమానులు (Prabhas Fans) రాత్రి నుంచే థియేటర్ల ముందు మకాం వేశారు. ఎప్పుడెప్పుడు ప్రీమియర్ షో పడుతుందా...లోపలికి వెళ్లి తమ అభిమాన నటుడి సినిమాని చూద్దామా అని ఎంతో ఆత్రంగా ఉన్నారు. బెనిఫిట్ షో లకు అభిమానులు పోటెత్తడంతో థియేటర్ల ముందు పోలీసులకు వారిని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ (Hyderabad) లో ఓ థియేటర్ వద్ద అభిమానులు మితీమిరి ప్రవర్తించడంతో పోలీసులు ప్రభాస్ అభిమానుల మీద లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. కల్కి 2898 ఏడీ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రధాన పాత్రలో నటించగా.. బాలీవుడ్ (Bollywood) ముద్దుగుమ్మలు దీపికా పదుకొన్, దిశా పటానీ (Disha Patani) హీరోయిన్లుగా చేశారు. 40 ఏళ్ల విరామం తర్వాత అమితాబ్,కమల్‌హాసన్ కలిసి ఈ సినిమాలో కనిపించారు. 600 కోట్లతో వైజయంతీ మూవీస్ ఈ సినిమాని నిర్మించింది. Also read: ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 9 కోచ్ లు! #prabhas #kalki #police #hyderabad #benfit-show మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి