Rain Alert in AP and TS: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. గురువారం నాడు కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ ప్రకటించింది.
ఈ క్రమంలోనే నెల్లూరు, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇప్పటికే రెండు రోజుల నుంచి ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.బుధవారం సాయంత్రం కూడా కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ,ఏలూరు, ప్రకాశం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
ఇదిలా ఉంటే అటు తెలంగాణ జిల్లాలో కూడా బుధవారం భారీ వర్షం కురిసింది. గురువారం కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
ఆగస్టు 25 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వివరించింది. ఈ మేరకు తెలంగాణ లోని కొన్ని జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Also Read: సింహాద్రి అప్పన్నకు వందకోట్ల చెక్!