T20 World Cup: ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) గురించి భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జూన్‌లో అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఈ టోర్నమెంట్ జరగనుండగా.. టీమ్‌ఇండియా(Team India) ఈ సారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే సీనియర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit sharma) లను పొట్టి ఫార్మాట్‌లోకి తీసుకోగా.. తుది జట్టు ఎంపికపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రైనా.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అదే పెద్ద ప్రశ్న..
ఈ మేరకు రైనా మాట్లాడుతూ.. ‘టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ చాలా కీలకం. అయితే మూడో స్థానంలో ఆడేందుకు విరాట్ ఇష్టపడతాడా? లేదా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కోహ్లీ మూడో స్థానంలో ఆడాలని కెప్టెన్ రోహిత్ కూడా కోరుకుంటున్నాడు. అలాగే దానికంటే ముందు జరగబోయే ఐపీఎల్‌లో విరాట్ మూడో ప్లేస్‌లో ఆడతాడో లేదో కూడా తెలియదు' అన్నారు.
కోహ్లీకి కెప్టెన్సీ..
'కానీ అతడు తన స్ట్రైక్‌రేట్‌ను మెరుగుపర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇది అతడికి స్ట్రైకింగ్ అవకాశం రావడంపై ఆధారపడి ఉంటుంది. నేను కెప్టెన్ అయితే ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించే బాధ్యత కోహ్లీకి అప్పగిస్తా. ఎందుకంటే అతడు తలుచుకుంటే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడతాడు. ఏ క్షణంలోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా ఉన్న ఆటగాడు' అంటూ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి : Deepfake : సచిన్ కు షాక్ ఇచ్చిన కేటుగాళ్లు.. ఆ వీడియో వైరల్
చాలా కీలకం..
అలాగే ఈ టోర్నమెంట్ లో విరాట్ మిడిల్ ఆర్డర్‌లో ఎక్కువ సమయం క్రీజులో ఉండాల్సిన అవసరముంటుందని, ఎందుకంటే వెస్టిండీస్ (westindies), యూఎస్ఏ (usa) పిచ్‌లు చాలా కఠినంగా ఉంటాయని తెలిపారు. 'ఇక్కడ స్పిన్నర్లు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇలాంటి పిచ్‌లపై బౌండరీలు రాని సమయంలో వేగంగా సింగిల్స్, డబుల్స్ రాబట్టాలి. కాబట్టి, వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తే సత్తా ఉన్న కోహ్లీ భారత్‌కు చాలా కీలకంగా మారనున్నాడు. టాప్ 3లో కనీసం ఒక్కరైనా 20 ఓవర్ల వరకు ఆడాతే బాగుటుంది' అని రైనా సూచించాడు. ఇక ఆదివారం అఫ్గాన్‌తో జరిగిన రెండో టీ20లో విరాట్ 16 బంతుల్లోనే 29 పరుగులు చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.