Michaung Cyclone: మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్.. రోడ్లపై కొట్టుకుపోతున్న కార్లు.. మిచౌంగ్ తుపాను వల్ల చెన్నైలో జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. రోడ్లపైకి భారీగా వరద రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. అలాగే చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వే పైకి భారీగా వరద చేరింది. దీంతో అధికారులు విమానాల రాకపోకలను నిలిపివేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. By B Aravind 04 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్ని నీటమునిగాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కార్లు కొట్టుకుపోయాయి. అలాగే చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వే పైకి భారీగా వరద చేరింది. దీంతో విమానాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఇప్పటిదాకా ఏకంగా 16 విమానాలను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. సోమవారం అర్థరాత్రి వరకు చెన్నై విమానశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలకు ఓ ప్రాంతంలో ఓ గోడ కూలడంతో ఇద్దరు మృతి చెందారు. అయితే వరద ప్రభావానికి రోడ్లపై కార్లు కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా There's a terrible cyclone in Chennai and parts of Tamil Nadu with scary visuals. Praying for safety of everyone 🙏#CycloneMichuang#ChennaiRains #ChennaiFloods pic.twitter.com/chBbgs98OT — Taehyung India FB | ᴸᵃʸᵒ(ꪜ)ᵉʳ ˡᵒᶜᵏᵈᵒʷⁿ •◡• (@Taehyung_india_) December 4, 2023 ఇదిలాఉండగా.. చెన్నైలోని ఓ ప్రాంతంలో రోడ్డు మొత్తం జలమయమైపోయింది. అయితే ఆ నీటిలోనుంచే ఓ అంబులెన్సు ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. #WATCH - Ambulance wading through a waterlogged street in Chennai as Cyclone Michaung triggers heavy rainfall across the city.#CycloneMichaung #ChennaiRains #Chennai pic.twitter.com/ychWtgZ9Iv — TIMES NOW (@TimesNow) December 4, 2023 #telugu-news #heavy-rains #cyclone-michaung మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి