Opening Cermony: పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఈరోజు సాయంత్రం 7.30గంటలకు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు మొదలవనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటలు దాటేంత వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ వేడుకలను గ్రాండ్‌గా చేయడానికి ఏర్పాట్లు చేసింది ఫ్రాన్స్ ప్రభుత్వం. అయితే ఈసారి ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ ఎప్పటిలా స్టేడియం లోపల కాకుండా పారిస్ మీదుగా ప్రవహించే సీన్ నది తీరంలో నిర్వహించున్నారు.
ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీలో క్రీడాకారులు పరేడ్ నిర్వహిస్తారు. కానీ ఈసారి మాత్రం బోట్ల మీద చేయనున్నారు. దాదాపు 10,500 మంది అథ్లెట్లు 100 బోట్లలో పరేడ్ చేయనున్నారు. సీన్ నదిలోని ఐకానిక్ బ్రిడ్జిలు, ల్యాండ్ మార్క్‌లను దాటుకుంటూ.. సీన్ నదిలో ఆరు కిలోమీటర్ల మేర అథ్లెట్ల బోట్ పరేడ్ కొనసాగనుంది. ఈ వేడుకలను 6 లక్షల మంది ప్రత్యక్షంగా తిలకించేలా ఫ్రాన్స్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మన దేశంలోని స్పోర్ట్స్ 18 నెట్ వర్క్ ద్వారా ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీని లైవ్‌లో చూడొచ్చు. అలాగే జియో సినిమా యాప్, వెబ్ సైట్ల ద్వారానూ లైవ్‌లో చూడొచ్చు.
అయితే ఈ ప్రారంభ వేడుకలకు వాన గండం ఉందని చెబుతోంది అక్కడ వాతావారణ శాఖ. ఉష్ణోగ్రతలు 20 నుంచి 24 వరకు ఉంటాయని చెప్పింది. కానీ తేలిక పాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని అంటోంది. సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం అవుతుందని..చిరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Also Read:Andhra Pradesh: టెట్ కోసం ఉచిత శిక్షణా కేంద్రాలు..ఏపీ సర్కార్ ఆఫర్