Rain Effect : IPL 2024 సీజన్ లో సన్ రైజర్స్ టీమ్ ప్లే ఆఫ్స్ కి చేరుకోడానికి రెడీ అవుతుంటే సరిగ్గా అదే టైం లో వరణుడు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధం అవుతున్నాడు. నేడు గుజరాత్ తో ఉప్పల్(Uppal) లో జరగబోయే హైదరాబాద్ మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
రెండు రోజులుగా ఎండ(Sun) లతో వేడిగా ఉన్న నగరం ఈ రోజు ఒక్కసారిగా చల్లబడిపోయింది. ప్రస్తుతం ఉప్పల్ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో జోరు వాన కురుస్తోంది. ఈ క్రమంలోనే ఉప్పల్ మైదానంలో సైతం వాన కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ(IMD) చెబుతుంది. దీంతో క్రికెట్ లవర్స్ అసలు ఈ రోజు మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్నారు.
Also Read : సన్ రైజర్స్ కి ఇదే మంచి ఛాన్స్.. అలా జరిగితే డైరెక్ట్ టాప్-2 లోనే!
మ్యాచ్ రద్దయితే?
ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్లే. అప్పుడు ఢిల్లీ, లక్నో రెండు టీమ్స్ ఇంటి ముఖం పట్టాల్సిందే. ఒకవేళ మ్యాచ్ రద్దయితే రెండు టీమ్స్ కి చెరో పాయింట్ వస్తుంది. అలా జరిగినా SRH 15 పాయింట్లతో ప్లే ఆప్స్ కి అర్హత సాధిస్తుంది.
ఆ తర్వాత పంజాబ్ తో జరగాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ గెలిస్తే టాప్-2 కి వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే, రాజస్థాన్ తన చివరి మ్యాచ్ లో కోల్ కత్తాపై ఓడిపోతేనే ఇది సాధ్యమవుతుంది. మరి ఈ రోజు ఉప్పల్ లో గుజరాత్ తో జరగబోయే హైదరాబాద్ మ్యాచ్ లో వరణుడు దయ చూపిస్తాడేమో చూడాలి.