Rains In Telangana: తెలంగాణలోని వివిధ జిల్లాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం నుంచి రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు ఏడు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
తాజా హెచ్చరికల ప్రకారం మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని తెలిపారు. అలాగే కుమురంభీం జిల్లా లో పిడుగుపాటుకు అంజన్న అనే యువకుడు మృతి చెందాడు.
Also Read: వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఖతమే.. కేంద్ర ఆరోగ్య శాఖ సీరియస్ యాక్షన్!