Hyderabad Rains: దంచికొడుతున్న వాన.. రేపు, ఎల్లుండి కూడా..

హైదరాబాద్‌లో భారీగా వర్షం కురుస్తోంది. రోడ్లన్ని జలమయయ్యాయి. దీంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా రేపు, ఎల్లుండి భారీ నుంతి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

New Update
Hyderabad Rains: దంచికొడుతున్న వాన.. రేపు, ఎల్లుండి కూడా..

హైదరాబాద్‌లో భారీగా వర్షం కురుస్తోంది. మాదాపూర్‌, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌,ఫిల్మ్‌నగర్‌, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేటతోపాటు పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. రోడ్లన్ని జలమయయ్యాయి. మాదాపూర్‌, హైటెక్‌సిటీలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా రేపు, ఎల్లుండి భారీ నుంతి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Also read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో డీఎస్సీ!

ఖమ్మం, సూర్యాపేట, కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. మంచిర్యాల, నిజామాబాద్‌, పెద్దపల్లి, నిర్మల్, ములుగు, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు