Telangana : రాష్ట్రంలో మరో మూడు రోజులు వానలే.. వానలు!

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి. మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

New Update
Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

Rain Alert : తెలంగాణ (Telangana) లో రానున్న మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) వివరించింది. సోమవారం నాటి ద్రోణి రాయలసీమ కొమొరిన ప్రాంతం వరకు విస్తరించి సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది.

సోమవారం, మంగళవారం, బుధవారం ఉదయం వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులు.. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖాధికారులు తెలిపారు. శుక్రవారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌ (Hyderabad) తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. కరీంనగర్‌, ములుగు, జయశంకర్‌, నల్గొండ, హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్లలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా హైదరాబాద్‌ నగర పరిధిలోని ఖైరతాబాద్‌లో 8.3 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

Also Read: బాక్సింగ్‌ కే జీవితం అంకితమిచ్చా..ఓటమి తట్టుకోలేకపోతున్నాను!

Advertisment
తాజా కథనాలు