ఇది రైల్వే స్టేషనా..లేక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టా..?

అహ్మదాబాద్‌లోని బుల్లెట్ రైలు రైల్వే స్టేషన్ అత్యాధునిక పద్ధతిలో రైల్వే శాఖ నిర్మిస్తుంది. దీనిని చూస్తే ఇది నిజంగా రైల్వే స్టేషనా...లేక అంతర్జాతీయ విమానాశ్రయమా అనే సందేహం కలగక మానదు.

New Update
ఇది రైల్వే స్టేషనా..లేక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టా..?

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అంతలా ఓ వీడియో నెట్టింట్లో ఎందుకు వైరల్‌ అవుతుంది..అసలు ఆ వీడియో ఏంటి అనుకుంటున్నారా? అది గుజరాత్‌ అహ్మదాబాద్‌ లోని సబర్మతీ మల్టీ మోడల్‌ ట్రాన్స్ పోర్ట్‌ హబ్‌ వద్ద రెడీ అవుతున్న తొలి బుల్లెట్‌ రైల్వే స్టేషన్‌కి సంబంధించిన వీడియో అది.

ఆ వీడియోను మంత్రి గురువారం సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా..పోస్ట్ చేసిన 24 గంటల్లోపే 5,65,00 వ్యూస్‌ వచ్చాయి. 20 వేల లైక్స్‌ వచ్చాయి. ఆ వీడియోని చూసిన వారు ఆ డిజైన్ ను చూసి నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్​ బుల్లెట్​ ట్రైన్​ కారిడర్​ ప్రాజెక్ట్​ నిర్మాణ దశలో ఉంది. చాలా వరకు నిర్మాణం పూర్తైందని తెలుస్తోంది.

దీని పనులు 2026 నాటికి మొదలవుతాయని సమాచారం. గుజరాత్‌ సూరత్‌ నుంచి బిలిమోరాకు 50 కి.మీల స్ట్రెచ్‌ లో ఈ మొదటి ఫేజ్‌ఉంటుంది. 2028 నాటికి ప్రాజెక్ట్‌ మొత్తం పూర్తవుతుందని రైల్వే అధికారులు వివరించారు. బుల్లెట్ ప్రాజెక్ట్‌ అందుబాటులోకి వస్తే..ముంబై- అహ్మదాబాద్‌ మధ్య ప్రయాణం కేవలం 2 గంటల 7 నిమిషాల్లోనే పూర్తవుతుందని తెలుస్తుంది.

ఈ ప్రాజెక్ట్‌ ను 2017 సెప్టెంబర్‌ ప్రధాని మోదీ, అప్పటి జపాన్‌ పీఎం షింజో అబే కలిసి ఈ ప్రాజెక్ట్‌ని ప్రారంభించారు. దీని కోసం 1.08 లక్షల కోట్ల ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు పెడుతుండగా..గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరో రూ.10 వేల కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. మిగిలిన నగదును 0.1శాతం వడ్డీతో జపాన్​ నుంచి అప్పుగా తీసుకొచ్చారు.

Also read: ఇక శ్రీలీలను కాపాడాల్సింది మహేష్‌ నే!

Advertisment
Advertisment
తాజా కథనాలు