Bullet Train: దేశంలో తొలి బుల్లెట్‌ రైలు ఎప్పుడు, ఏ మార్గంలో నడుస్తుందో తెలిపిన రైల్వే మంత్రి!

దేశంలో తొలి బుల్లెట్‌ రైలు నడపడానికి అహ్మదాబాద్‌, మహారాష్ట్ర రూట్‌ ను ఎంపిక చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ముంబై -అహ్మదాబాద్‌ మధ్య దేశంలోనే తొలి హైస్పీడ్ రైల్ కారిడార్ పురోగతిపై మంత్రి సంతృప్తిని వ్యక్తం చేశారు.

New Update
Bullet Train: దేశంలో తొలి బుల్లెట్‌ రైలు ఎప్పుడు, ఏ మార్గంలో నడుస్తుందో తెలిపిన రైల్వే మంత్రి!

దేశంలో హైస్పీడ్‌ రైళ్లను(Hi-speed Trains)  నడపడానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ద పెట్టిన విషయం తెలిసిందే. దాని వల్లే నేడు భారత్‌ లో అనేక రాష్ట్రాల్లో వందేభారత్‌ (Vandebharat Trains) రైళ్లు పరుగులు పెడుతున్నాయి. దీంతో పాటు బుల్లెట్ రైళ్లను నడపడానికి కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ (Aswin Vaisnav) ముంబైలోని బీకేసీ, విక్రోలి బుల్లెట్‌ రైలు స్టేషన్లను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో తొలి బుల్లెట్‌ రైలు నడపడానికి అహ్మదాబాద్‌, మహారాష్ట్ర రూట్‌ ను ఎంపిక చేసినట్లు వివరించారు. ముంబై -అహ్మదాబాద్‌ (Mumbai-ahmadabad) మధ్య దేశంలోనే తొలి హైస్పీడ్ రైల్ కారిడార్ పురోగతిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. BKC స్టేషన్‌లో పని ప్రారంభించి దాదాపు ఒక సంవత్సరం అయ్యింది.

ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ, హైస్పీడ్ రైలు కారిడార్ నగరాల మధ్య ప్రయాణంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడమే కాకుండా ముంబై, సూరత్, ఆనంద్, వడోదర, అహ్మదాబాద్ ఆర్థిక వ్యవస్థలను కూడా కలుపుతుందని చెప్పారు. ముంబై - అహ్మదాబాద్ చివరికి ఒకే ఆర్థిక జోన్‌గా మారుతాయని అన్నారు. 2026 ఆగస్టు నాటికి సూరత్, బిలిమోరా స్టేషన్ల మధ్య మొదటి బుల్లెట్ రైలు నడపనున్నట్లు ఆయన ప్రకటించారు.

బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో గంటకు 220 కి.మీ నుంచి 320 కి.మీ వేగంతో నడుస్తాయి. ఇది 2.07 గంటల నుండి 2.58 గంటలలో ముంబై నుండి అహ్మదాబాద్‌ని కలుపుతుంది. హైస్పీడ్ రైల్ కారిడార్ ఆర్థిక ప్రభావాన్ని కూడా రైల్వే అధ్యయనం చేస్తుంది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) బుల్లెట్ రైలు మార్గం కోసం గుజరాత్‌లో 284 కి.మీ పొడవైన ఎలివేటెడ్ లైన్ ని ఇప్పటికే పూర్తి చేసింది.

Also read: రామ్‌ చరణ్‌ సినిమాలో చిన్న క్యారెక్టర్‌ అయినా సరే చేస్తాను: సూర్య!

Advertisment
Advertisment