Rahul : ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి ఉండేది కాదు.. షర్మిలే..వైఎస్‌ఆర్‌ వారసురాలు.. రాహుల్‌ గాంధీ స్పెషల్ వీడియో..!

వైఎస్‌ఆర్‌ 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఓ వీడియో రిలీజ్ చేశారు. వైఎస్‌ఆర్‌ అసలైన ప్రజా నాయకుడంటూ కొనియాడారు. ఆయన వారసత్వాన్ని షర్మిలా సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్తుందని పేర్కొన్నారు. ఆయన బ్రతికి ఉంటే ఏపీ ముఖచిత్రం వేరేలా ఉండేదన్నారు.

Rahul : ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి ఉండేది కాదు.. షర్మిలే..వైఎస్‌ఆర్‌ వారసురాలు.. రాహుల్‌ గాంధీ స్పెషల్ వీడియో..!
New Update

Rahul Special Video :  వైఎస్‌ఆర్‌ (YSR) 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఓ వీడియో రిలీజ్ చేశారు. అసలైన ప్రజా నాయకుడు వైఎస్‌ఆర్‌ అంటూ కొనియాడేవారు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడని.. ఆయన మరణం అత్యంత విషాదకరమని అన్నారు. YSR బ్రతికి ఉంటే ఏపీ ముఖచిత్రం వేరేలా ఉండేదని..ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి ఉండేది కాదని కామెంట్స్ చేశారు.

Also Read: ఘనంగా వైఎస్‌ఆర్‌ 75వ జయంతి.. ఒకవైపు జగన్, మరోవైపు షర్మిల.. భోవోద్వేగానికి లోనైన విజయమ్మ..!

YSR వారసత్వాన్ని షర్మిలా సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్తుందని..ఆ నమ్మకం తనకు బలంగా ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. షర్మిల న్యాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని.. వైఎస్‌ఆర్‌ లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, న్యాయకత్వ లక్షణాలు షర్మిల (Sharmila) లో చూశానని అన్నారు.తాను వ్యక్తిగతంగా వైఎస్‌ఆర్‌ నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు. YSR పాదయాత్ర తన జోడో యాత్రకు స్ఫూర్తి అని.. నాడు YSR ఎండను, వర్షాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేశారని గుర్తుచేశారు.

#congress #ysr #rahul-gandhi #sharmila
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe