Viral Video: నోరు జారిన రాహుల్..సెటైర్ వేసిన బీజేపీ..అసలేం జరిగిందంటే..!!

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నోరుజారారు. దీంతో బీజేపీ రాహుల్ ను టార్గెట్ చేసింది. ఛత్తీస్ గఢ్ లో తమ పార్టీ ప్రభుత్వం పడిపోతుందని రాహుల్ టంగ్ స్లిప్ అయ్యింది. దీంతో బీజేపీ రాహుల్ పై ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ అధినేత ఓటమిని అంగీకరించారంటూ సెటైర్లు వేస్తోంది. రాహుల్ జీ ...మీ ఓటమిని ఒప్పుకున్నారు అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది.

New Update
Rahul Gandhi: ఉపాధి హమీ కూలీలు, కౌలు రైతులకు రాహుల్ ఆఫర్..

Rahul Gandhi Tongue Slipped: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నోరుజారారు. దీంతో బీజేపీ (BJP) రాహుల్ ను టార్గెట్ చేసింది. ఛత్తీస్ గఢ్ లో తమ పార్టీ ప్రభుత్వం పడిపోతుందని రాహుల్ టంగ్ స్లిప్ అయ్యింది. దీంతో బీజేపీ రాహుల్ పై ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ అధినేత ఓటమిని అంగీకరించారంటూ సెటైర్లు వేస్తోంది. రాహుల్ జీ ...మీ ఓటమిని ఒప్పుకున్నారు అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం కూడా జరిగింది. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ (Rahul Gandhi) విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుల గణనపై కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ స‌మ‌యంలో రాహుల్ గాంధీ చేసిన ప‌ని మ‌రోసారి బీజేపీకి ఛాన్స్ ఇచ్చేలా చేసింది. నిజానికి, విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ బిజెపిపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ , రాజస్థాన్ లో తమ పార్టీ నిష్క్రమిస్తోందన్నారు.

ఇది జరిగిన వెంటనే రాహుల్ తన తప్పును సరిదిద్దుకున్నారు. నేను తప్పుగా మాట్లాడాను..మీరు జర్నలిస్టులు నన్ను గందరగోళానికి గురిచేస్తున్నారు అందుకే ఇలా పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధిస్తుందని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది బీజేపీ నేతలు ఈ వీడియో ను షఏర్ చేస్తూ రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వాళ్ళు మొదలు పెట్టారు.. మేము ముగిస్తాం..! ఆ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్..!

రాహుల్ గాంధీ టంగ్ స్లిప్ వీడియోను బీజేపీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేసింది. రాహుల్ గాంధీ అంగీకరించారు, కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్ , ఛత్తీస్‌గఢ్‌ల్లో నిష్క్రమిస్తుందని.... ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్, రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. దీనికి ముందు కూడా రాహుల్ గాంధీ చేసిన ఓ ప్రకటన చర్చనీయాంశమైంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని కొంతకాలం క్రితం ఓ ప్రకటనలో పేర్కొన్న ఆయన, రాజస్థాన్‌లో పార్టీ విజయంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు