Viral Video: నోరు జారిన రాహుల్..సెటైర్ వేసిన బీజేపీ..అసలేం జరిగిందంటే..!!
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నోరుజారారు. దీంతో బీజేపీ రాహుల్ ను టార్గెట్ చేసింది. ఛత్తీస్ గఢ్ లో తమ పార్టీ ప్రభుత్వం పడిపోతుందని రాహుల్ టంగ్ స్లిప్ అయ్యింది. దీంతో బీజేపీ రాహుల్ పై ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ అధినేత ఓటమిని అంగీకరించారంటూ సెటైర్లు వేస్తోంది. రాహుల్ జీ ...మీ ఓటమిని ఒప్పుకున్నారు అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది.