ఎన్నికల ఎఫెక్ట్.. తెలంగాణకు రాహుల్ గాంధీ.. కీలక ప్రకటన చేయనున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారు. నవంబర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆరు రోజులపాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో రాహుల్ పలు కీలక పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
ఎన్నికల ఎఫెక్ట్.. తెలంగాణకు రాహుల్ గాంధీ.. కీలక ప్రకటన చేయనున్నారా?

Rahul Gandhi Telangana Tour: తెలంగాణలో చలితో పాటు రాజకీయ వేడి కూడా పెరిగింది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నాయకులు తమ ప్రచారాల్లో స్పీడ్ పెంచుతున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు, తెలంగాణను ఇచ్చినందుకు గెలిపించాలని కాంగ్రెస్ నేతలు, తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే తమకే ఓటు వేయాలంటూ బీజేపీ నేతలు... ఇలా ఎవరి నచ్చినట్లు వారు ప్రచారాల్లో దూసుకుపోతున్నారు.

ALSO READ: రుణమాఫీపై కీలక అప్డేట్.. చదవండి!

తెలంగాణలో మరోసారి పర్యటించేందుకు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ ఆరు రోజులపాటు తెలంగాణలో మకాం వేయనున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి 23 తేదీ వరకు తెలంగాణలో రాహుల్ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేపట్టనున్నారు. నవంబర్‌ 17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్‌ గాంధీ.. అదే తేదీలో పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో కాంగ్రెస్‌ నిర్వహించే సభల్లో పాల్గొంటారు. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీని ఓడించింది ఆ రాష్ట్ర పగ్గాలను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు తెలంగాణపై నజర్ పెట్టింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేయకపోవడం, నేతల రాజీనామాలు లాంటి అంశాలతో తెలంగాణలో బీజేపీ - బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అని విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ చేపట్టింది.

ALSO READ: సీఎం కేసీఆర్ కు కోటి రూపాయిల అప్పు ఇచ్చిన నేత.. ఎవరంటే?

ఇప్పటికే ఆరు గ్యారెంటీలతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ తెలంగాణ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ, రైతు బంధు డబ్బులు పెంపు, కౌలు రైతులకు కూడా రైతు బంధు, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయంతో పాటు ఉచిత బస్సు ప్రయాణం, 24 గంటల ఉచిత విద్యుత్తు, పంటకు కనీస మద్దతు ధర పెంపు, గ్యాస్ సిలిండర్ కేవలం రూ.500కే ఇలా అన్నీ వర్గాల ప్రజలను తమవైపు తిప్పుకునేలా ప్రచారం జోరుగా చేస్తోంది. కాంగ్రెస్ హామీలను పోలి ఉండేలా బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక హామీలను వెల్లడించింది. తాజాగా రాహుల్ తెలంగాణ పర్యటనలో మరికొన్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ అగ్రనేతలు కూడా ఎన్నికలకు ముందు తెలంగాణలో పర్యటన చేయనున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు