Rahul Gandhi: కేదార్‌నాథ్‌లో భక్తులకు 'టీ' అందించిన రాహుల్ గాంధీ.. ఫొటోలు వైరల్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉత్తరఖాండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. కేదారేశ్వరుడ్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అక్కడ 'ఛాయ్ సేవ'లో పాల్గొని భక్తులకు ఆయన 'టీ' అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By B Aravind 06 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Rahul Gandhi at Kedarnath Temple: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం ఉత్తరఖాండ్‌లోని (Uttarakhand) కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ప్రైవేటు హెలికాప్టర్‌లో కేథార్‌నాత్ చేరుకున్న ఆయనకు.. పూజారులు, కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం రాహుల్ కేదారేశ్వరుడ్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సాయంత్రం హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ సందర్భంగా రాహుల్ అక్కడ 'ఛాయ్ సేవ' లో (Chai Seva) పాల్గొని భక్తులకు టీ అందించారు. ఆ తర్వాత భక్తులతో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. వీటిని కాంగ్రెస్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరలవుతున్నాయి. अपनी केदारनाथ यात्रा के दौरान श्रद्धालुओं के लिए चाय सेवा देते @RahulGandhi जी 📍 केदारनाथ मंदिर, उत्तराखंड pic.twitter.com/CSpRlIKcsb — Congress (@INCIndia) November 5, 2023 Also Read: రేపే మిజోరాం ఎన్నికలు.. ఆ మూడు పార్టీల మధ్యే గట్టి పోటీ.. ఇదిలా ఉండగా. రాహుల్ గాంధీ (Rahul Gandhi) జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రైతులు, ట్రక్కు డ్రైవర్లు, వ్యాపారులు, రైల్వేస్టేషన్ కూలీలు.. ఇలా అన్ని వర్గాలు ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే హోరాహోరీగా ఆయా రాష్ట్రాల్లో ప్రచారాలు చేస్తోంది. ఈనెల 15 నుంచి 28వ తేదీ వరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. 14 రోజుల పాటు రాష్ట్రంలోనే మకాం వేసి ప్రచారాల జోరు పెంచనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ప్రతీ జిల్లా, ప్రతీ నియోజకవర్గానికి వెళ్లేలా వీరి పర్యటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర నాయకులు రూట్ మ్యాప్ ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. Also Read: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని! #telugu-news #congress #rahul-gandhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి