Rahul Gandhi : సత్యపాల్ మాలిక్‎తో రాహుల్...పుల్వామా దాడులు, అదానీ గురించి చర్చించా..!!

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానంపై ప్రశ్నలు సంధించారు. సెక్షన్ 370ని తొలగించిన తర్వాత అక్కడి పరిస్థితులను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ విషయాన్ని రాహుల్ స్వయంగా తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. బీజేపీ నియమించిన గవర్నర్ గా పనిచేసిన సత్యపాల్ మాలిక్, పదవీ విరమణ అనంతరం బీజేపీ అగ్రనాయకత్వంపై..మోదీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

New Update
Rahul Gandhi : సత్యపాల్ మాలిక్‎తో రాహుల్...పుల్వామా దాడులు, అదానీ గురించి చర్చించా..!!

పుల్వామా దాడులు, అదానీ వ్యవహారం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన, అగ్నివీర్ తోపాటు పలు అంశాలపై జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చర్చించారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానెల్లో అప్ లోడ్ చేశారు. ఈ క్రమంలో చాలా విషయాల గురించి ఇద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయాన్ని రాహుల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా రాహుల్ పోస్టు చేశారు. తమపై ఈడీ, సీబీఐల ప్రమేయం ఉంటుందా అంటూ మోదీ సర్కార్ పై వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

ఎయిర్‌పోర్టులో గదిలో బంధించారు:రాహుల్ గాంధీ
ఈ సందర్భంగా ఎంపీ రాహుల్ గాంధీ పుల్వామా దాడిని ప్రస్తావిస్తూ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. పుల్వామాలో వీరమరణం పొందిన సైనికుడి పార్థివదేహం విమానాశ్రయానికి వస్తోందని విని నేను విమానాశ్రయానికి బయలుదేరాను. మా సెక్యూరిటీ వారు అక్కడికి వెళ్లవద్దని చెప్పారు, కానీ నేను విమానాశ్రయానికి బయలుదేరాను. "నేను విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, నన్ను ఒక గదిలో బంధించారు. మీరు గది నుండి బయటకు రాలేరని చెప్పారు. అక్కడికి ఆర్మీ వ్యక్తులు వస్తున్నారు, ప్రధాని మోదీ వస్తున్నారు. నన్ను గదిలో వేసి తాళం వేశారు. సెక్యూరిటీ వాళ్లతో గొడవపడి అక్కడి నుంచి బయటికి వచ్చేశాను.

పుల్వామా దాడిపై సత్యపాల్ మాలిక్ ఏం చెప్పారు?
ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆ సమయంలో విమానాశ్రయంలో ఏదో పెద్ద కార్యక్రమం జరుగుతున్నట్లు అనిపించిందని అన్నారు. దీని తర్వాత మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా పుల్వామా ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పుల్వామాలో సిఆర్‌పిఎఫ్ జవాన్లు రోడ్డు మార్గంలో వెళ్తున్నందున వీరమరణం పొందారని, సిఆర్‌పిఎఫ్ ఐదు విమానాలను హోం మంత్రిత్వ శాఖ నుండి కోరిందని, ఈ దరఖాస్తు నాలుగు నెలలుగా మంత్రిత్వ శాఖలో నిలిచిపోయిందని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి:టార్గెట్ రాజగోపాల్ రెడ్డి.. నేడు మునుగోడు గడ్డపై కేసీఆర్ మీటింగ్!

పుల్వామా విషయంలో నా హెచ్చరికలను కేంద్రం పట్టించుకోలేదు: మాలిక్

పుల్వామా విషయంలో తాను హెచ్చరికలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు సత్యపాల్ మాలిక్. పుల్వామా దాడిని ఓట్ల కోసం ఉపయోగించుకున్నారని పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు. పుల్వామా దాడిలో సీఆర్పీఎఫ్ వాహనాన్ని ఢీకొట్టి.. ఈ ఘటనకు ప్రధాన కారణమైన వాహనం.. అంతకుముందు 10 రోజులుగా అదే ప్రాంతంలో తిరిగిందని సత్యపాల్ మాలిక్ తెలిపారు. ఆ వాహనాన్ని తనిఖీలు చేసినవారే లేరని.. దాని డ్రైవర్, యజమానికి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని సంచలనవ్యాఖ్యలు చేశారు. అయితే ఘటనకు ముందే వారిని అరెస్ట్ చేసి విడుదల చేశారన్నారు. అయితే వారు ఇంటెలిజెన్స్ రాడార్‌లో లేరని.. పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్థాలు తెప్పించారని సత్యపాల్ మాలిక్ పలు సంచలన ఆరోపణలు చేశారు.

ఇది కూడా చదవండి: సీట్ల కోసం నేతల మధ్య ఆధిపత్య పోరు..తలపట్టుకున్న అధిష్టానం..!!

అదానీ గురించి రాహుల్, సత్యపాల్ మధ్య చర్చ:
అటు అదానీ గురించి రాహుల్, సత్యపాల్ మాలిక్ మధ్య ప్రస్తావన వచ్చింది. రైతుల వద్ద నుంచి పంటలు కొనేందుకు అదానీ పెద్ద గోడౌన్స్ నిర్మించారన్నారు. ఈ కారణంగానే కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హమీని నిలబెట్టుకోలేదన్నారు. ప్రభుత్వం డబ్బు అంతా అదానీ వద్ద ఉందని దేశ ప్రజలు అనుకుంటున్నారని మాలిక్ అన్నారు. మణిపూర్‌లో అల్లర్ల గురించి మాట్లాడిన సత్యపాల్ మాలిక్.. పరిస్థితులను నియంత్రించేందుకు ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి రాదని సత్యపాల్ మాలిక్ అన్నారు.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

Advertisment
తాజా కథనాలు