INDIA Alliance: ప్రధానమంత్రి అభ్యర్ధిగా మల్లికార్జున ఖర్గే..నితీష్‌తో మాట్లాడిన రాహుల్ గాంధీ

కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో ఇండియా కూటమి నుంచి తమ ప్రధానమంత్రి అభ్యర్ధిగా మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించారు. దీనికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఒప్పుకున్నారని రాహుల్ గాంధీ తెలిపారు.

INDIA Alliance: ప్రధానమంత్రి అభ్యర్ధిగా మల్లికార్జున ఖర్గే..నితీష్‌తో మాట్లాడిన రాహుల్ గాంధీ
New Update

Mallikarjun Kharge: లోక్ సభ ఎన్నికలు...దానిలో విజయం గురించి ఇండియా కూటమి ప్లాన్ లు వేస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ దాని నుంచి బయటపడి పార్లమెంటు ఎలక్షన్స్ లో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీకి (BJP) గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఇండియా కూటమితో (INDIA Alliance) కలిసి వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా మల్లిఖార్జున ఖర్గేను ప్రధానమంత్రి అభ్యర్ధిగా..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ లు ప్రతిపాదించారు. దీనికి ఇండియాకూటమిలో ఉన్న వారందరూ ఆమోదం తెలిపారు.

Also read:మీకు వేరే దారి లేదు..హమాస్‌కు నెతన్యాహు అల్టిమేటం

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, లాలాఊ యాదవ్ లు మాత్రం మల్లిఖార్జున ఖర్గే ప్రధానమంత్రి (Mallikarjun Kharge as PM) అభ్యర్ధిత్వాన్ని గురించి ఏమీ చెప్పలేదు. అయితే కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దీని గురించి క్లారిఫికేషన్ ఇచ్చారు. తాను నితీష్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడానని..ఆయనకు ఏమీ అభ్యంతరం లేదని చెప్పారు రాహుల్ గాంధీ. ఖర్గే ప్రధానమంత్రి ప్రతిపాదన గురించి తనకు తెలియదని చెప్పారని...ఆ విషయం గురించి తాను వివరించానని రాహుల్ గాంధీ చెప్పారు. ఖర్గే ప్రధానమంత్రి అభ్యర్ధిగా తన పూర్తి సహకారం ఉంటుందని నితీష్ చెప్పారని అన్నారు. ఏ సమయంలోనైనా మంత్రివర్గంలో కాంగ్రెస్ మంత్రుల సంఖ్యను పెంచడానికి తాను సిద్ధంగా ఉన్నాని తెలిపారని అన్నారు.

అన్నీ కలిసివస్తే మల్లికార్జున ఖర్గే దేశానికి మొదటి దళిత ప్రధాని అవుతారని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇదఇ లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించేందుకు సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయం మీద ఖర్గే కూడా స్పందించారు. ప్రస్తుతానికి తన దృష్టి అంతా లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు మీదనే ఉందని చెప్పారు. కూటమి బలాన్ని పెంచడం ఒక్కటే లక్ష్యంగా ముందుకు వెళతానని...మిగతా విషయాలన్నీ తరువాతనే అన్నారు ఖర్గే.

2024 లోక్ సభ ఎన్నికలకు తమ అభ్యర్ధులను అతి త్వరలోనే నిర్ణయిస్తామని కాంగ్రెస్ తెలిపింది. బీజేపీ మిత్రపక్సాలకు వ్యతిరేకంగా ఇండియా కూటమిని బలమైన శక్తిగా మార్చే విధంగా పాటుపడతామని తెలిపారు.

#mallikarjun-kharge #nithish-kumar #india-alliance #rahul-gandi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe