T20 World Cup 2024: T20 వరల్డ్‌కప్ ముందు టీమిండియా చివరి పొట్టి సిరీస్‌ను ఆడేసింది. ఇంగ్లాడ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరిగిన తర్వాత ఇండియా ఆటగాళ్లు ఐపీఎల్ 2024లో ఆడనున్నారు. ఆ తర్వాత యూఎస్, వెస్టిండీస్ కలిసి నిర్వహించనున్న టీ 20 ప్రపంచకప్‌లో ఆడతారు. అయితే పొట్టి టోర్నీలో ఎవరికి అవకాశం వస్తుందో అని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఫ్ఘనిస్థాన్ సిరీస్ జరిగిన తర్వాత టీమిండియాకు సారథ్యం వహిస్తున్న రోహిత్ శర్మ .. 8-10 తమ దృష్టిలో ఉన్నట్లు తెలిపాడు.
ఒకరు వైదలగొడం, మరొకరికి సర్జరీ
అయితే యంగ్ క్రికెటర్లైన ఇషాన్ కిషన్ (Ishan Kishan), రిషభ్ పంత్‌లు (Rishabh Pant) కూడా పొట్టి టోర్నీ రేసులో ఉన్నట్లు కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. అయితే అఫ్ఘనిస్థాన్ T-20 సిరీస్‌లో ఇషాన్ కిషన్, రిషభ్ పంత్‌లకు స్థానం లభించలేదు. ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా టూర్‌కు ఎంపికై మళ్లీ మధ్యలో వైదొలిగాడు. క్షమశిక్షణ చర్యల్లో భాగంగా అతడ్ని అఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్‌లో మొదటి రెండు టెస్టులకు తీసుకోలేదన్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. ఇక రిషభ్ పంత్‌కు కారు యాక్సిడెంట్ గురైన తర్వాత ఇప్పుడు మోకాలి సర్జరీ నుంచి క్రమంగా కోలుకుంటున్నాడు.
Also Read: టీమిండియాకు బిగ్ షాక్.. విరాట్ కోహ్లీ అవుట్
వాళ్లు అందుబాటులో ఉన్నారు
పంత్ 17వ సీజన్ ఐపీఎల్ 2024లో మళ్లీ ఆడే అవకాశం ఉంది. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లకు కూడా టీ20 ప్రపంచకప్‌లో అవకాశం ఉండదని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) టీ 20 దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. ' టీ20 ప్రపంచకప్ 2024 కోసం మాకు వికెట్ కీపింగ్ ఆప్షన్లు చాలావరకు ఉన్నాయి. అఫ్ఘానిస్థాన్ సిరీస్‌లో ఆడినటువంటి జితేశ్ శర్మ, సంజూ శాంసన్ లతో సహా.. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్‌లు పొట్టి టోర్నీకి అందుబాటులో ఉన్నారు. టీ 20 వరల్డ్ కప్‌కు ఇంకా సమయముంది ఆలోపు ఉత్తమ కీపర్లను ఎంపిక చేస్తామని' రాహుల్ ద్రవిడ్ అన్నాడు.