/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-28T201509.654-jpg.webp)
Rahat Fateh Ali Khan: పాకిస్థాన్‌కు (PAK) చెందిన ప్రముఖ స్టార్ సింగర్ (Singer) రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ (Rahat Fateh Ali Khan) వింత ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. తన దగ్గర మ్యూజిక్ ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థిని చెప్పుతో కొడుతూ విచక్షణ రహింతగా వ్యవహరించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు, ప్రముఖులు మండిపడుతున్నారు. ఇదేం సంస్కారమంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Pakistani singer Rahat Fateh Ali khan was caught abusing his servant. Later, he gave an explanation. pic.twitter.com/PC0DawSEsq
— Брат (@B5001001101) January 27, 2024
సహనం కోల్పోయి దాడి..
ఇక అసలు విషయానికొస్తే.. ఫతేహ్ అలీ ఖాన్ తన దగ్గర సంగీతం నేర్చుకుంటున్న యువకుడిని చితకబాదారు. తాను చెప్పిన పని చేయలేదనే కోపంలో ఆగ్రహానికి లోనై చెప్పుతో కొట్టాడు. వీడియోలు పరిశీలిస్తే ఒక బాటిల్ కనిపించకుండా పోయిన విషయంలో అతడిపై చేయి చేసుకున్నట్లు అర్థమవుతోంది. అయితే దెబ్బలు తట్టుకోలేక తనని వదిలేయాలంటూ బాధితుడు ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ సహనం కోల్పోయిన అలీ ఖాన్ అలాగే దాడి చేయడంతో పక్కనున్న ఇతరులు అడ్డుకుని శాంతింపజేశారు.
ఇది కూడా చదవండి : Shraddha: పబ్లిసిటీ కోసం పాకులాడే నటిని కాదు.. నటి పోస్ట్ వైరల్
కొడుకు లాంటి వాడు..
ఇక వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రహత్ స్పందించాడు. 'ఇది గురు, శిష్యుల మధ్య విషయం. అతను నా సొంత శిష్యుడే. నాకు కుమారుడిలాంటి వాడు. శిష్యుడు తప్పు చేస్తే గురువు దండించినట్లుగానే దీన్ని భావించాలి. ఒకవేళ అతడు మంచి చేస్తే ప్రేమ కురిపిస్తా. తప్పు చేస్తే శిక్షిస్తా' అన్నారు. బాధితుడికి తర్వాత క్షమాపణలు చెప్పినట్లు రహత్ వెల్లడించాడు.
తండ్రిలాంటి వాడు..
ఈ ఘటనపై బాధితుడు మాట్లాడుతూ.. 'పవిత్ర జలానికి సంబంధించిన ఓ బాటిల్ కనిపించకుండా పోవడానికి నేనే కారణం. అందుకే ఫతేహ్ అలీ ఖాన్ దండించాడు. అంతకుమించి దీంట్లో ఎలాంటి దురుద్దేశం లేదు. అలీ ఖాన్ నాకు తండ్రిలాంటి వాడు. నన్ను చాలా ప్రేమిస్తారు. తమ గురువు పరువుకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఎవరో ఈ వీడియోను వైరల్ చేశారు' అని వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.