Rahat Fateh: విద్యార్థిని చెప్పుతో కొట్టిన స్టార్ సింగర్.. వీడియో వైరల్
పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ గాయకుడు రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ తన దగ్గర సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థిని చెప్పుతో కొట్టాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు రాహత్ పై మండిపడ్డారు. దీంతో బాధితుడికి క్షమాపణలు చెప్పిన రాహత్ మరో వీడియోను పోస్ట్ చేశాడు.