/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-28T195106.193-jpg.webp)
Mannara: బాలీవుడ్ యాక్ట్రెస్ మన్నారా చోప్రా (Mannara chopra)తో తనకు విభేదాలున్నట్ల వస్తున్న వార్తలపై నటి శ్రద్ధా దాస్ (Shraddha Das) తనదైన స్టైల్ లో రియాక్ట్ అయింది. నిజానికి తాను ఎవరితో గొడపడే మనిషని కాదని, ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్పేస్తానని తెలిపింది. అంతేకాదు తమ మధ్య అనవసరంగా గొడవలు క్రియేట్ చేయొద్దని, తాను పబ్లిసిటీ కోసం పాకులాడే నటిని కాదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
2/2:@shraddhadas43 radiates both the heat of fire and the charm of pure beauty. 🔥#ShraddhaDas#Shraddha#ScrollandPlaypic.twitter.com/WgQPL8xv6R
— Scroll And Play (@scrollandplay) January 22, 2024
నేను ఎప్పుడూ మాట్లాడలేదు..
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఈ ఇష్యూను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టిన శ్రద్ధాదాస్.. ‘మన్నారా చోప్రా లేదా ఆమె ఫ్యామిలీ గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. ఆ వ్యవహారంపై ఏ ఇంటర్వ్యూలోనూ నేను స్పందించలేదు. నాకు పబ్లిసిటీ కావాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ లేదా ఎక్స్ (గతంలో ట్విటర్)లో వీడియో పోస్ట్ చేసేదాన్ని. ఈ విషయంలో అనవసరంగా రియాక్ట్ కాదలచుకోలేదు. మౌనంగానే ఉండాలనుకుంటున్నా. గతంలో నేను ఆమె విషయంలో బాధపడ్డది నిజమే. కానీ ఇప్పుడు వీటన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను’ అంటూ శ్రద్ధా క్లారిటీ ఇచ్చింది.
ఇది కూడా చదవండి:Ap: ముద్దులు, గుద్దులు, రద్దులు.. సైకో జగన్ కు ఇవే తెలుసు: చంద్రబాబు
Ganpati Bappa 🙏❤️#MannaraChoprapic.twitter.com/hz1qADDqj7
— Mannara Chopra (@memannara) January 27, 2024
‘జిద్’ లో స్క్రీన్ షేరింగ్..
ఇక తెలుగులో ‘సిద్ధు ఫ్రమ్ సికాకుళం’తో సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా.. ‘జిద్’ అనే హిందీ మూవీ కోసం మన్నారా చోప్రాతో కలిసి పనిచేసింది. ఈ సినిమా షూట్‌లో మన్నార తనని గాయపరిచిందని గతంలో చెప్పారు. ఫైట్ షూట్‌లో డమ్మీ కర్రలతో కాకుండా నిజమైన కర్రలతో కొట్టిందని, బలవంతంగా మెట్లపై నుంచి తోసేసిందని.. ఛాతీపై బలంగా తన్నిందన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. దీనిపై మన్నార స్పందిస్తూ అలాంటిది ఏమీ లేదన్నారు. ప్రియాంకా చోప్రా (మన్నార కజిన్) కూడా మద్దతు తెలిపారు. షూట్‌లో ఇలాంటివి సహజమంటూ గొడవకు ముగింపు పలికారు. కానీ మరోసారి ఇందుకు సంబంధించిన వార్తలు చర్చనీయాంశమయ్యాయి.