Gandhi Medical Collage :హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఈ ర్యాగింగ్ భూతం వల్ల ఎంతో మంది అమాయక విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. మరెంతోమంది తమ బంగారు భవిష్యత్తును కోల్పోయిన ఘటనలను ఎన్నో చూశాం. దీంతో అన్ని కళాశాల్లో, విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ...ఈ ర్యాగింగ్ ను రూపు మాపేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇలాంటి పిచ్చిచేష్టలు చట్టరిత్యానేరమూని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠినచర్యలు పడతాయని తెలిసినా...కొంతమంది ఆకతాయి విద్యార్థులు మాత్రం తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. పరిచయం లేదా ఇంటరాక్షన్ పేరుతో హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ లో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలేజీలోని ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై కొంతమంది సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు అరెస్ట్.. టీడీపీ లీగల్‌సెల్ ఐదు ఫెయిల్యూర్స్ ఇవే..!
గాంధీ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై పది మంది సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి తెలిపారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కాలేజీ యాజమాన్యం...ఆ పది మందిపై చర్యలు తీసుకుందిన కాలేజీ హాస్టల్ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేసింది. ఏ విద్యాసంస్థలోనైనా ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇలాంటిచర్యలను ఎట్టిపరిస్థితిలోనూ సహించేది లేదని జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఈమధ్యే వరంగల్ మెడికల్ కాలేజీకి చెందిని ప్రీతీ సీనియర్ వేధింపుల వల్ల మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంది. అప్పటి నుంచి చాలామంది మెడికోలు ఆత్మహత్యలు చేసుకున్నా వాటికి కారణం ర్యాగింగ్ అని వెల్లడికాలేదు. అయినప్పటికీ ఇలాంటి సమయంలో ర్యాగింగ్ మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: రెండు రోజులు కుమ్ముడే.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!