Lok sabha Elections: ఎన్నికల తర్వాత దేశం ఎదుర్కోబోయే అతిపెద్ద సవాలు అదే: మాజీ ఆర్బీఐ గవర్నర్ ఆర్థికాభివృద్ధి హైప్‌ను నమ్మి భారత్ పెద్ద తప్పు చేస్తోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అతిపెద్ద సవాలు విద్యా వ్యవస్థ, శ్రామికుల నైపుణ్యాలను మెరుగుపర్చడమే అని అన్నారు. By B Aravind 27 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీల నేతలు ఎన్నికల రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఆర్థికాభివృద్ధి హైప్‌ను నమ్మి భారత్ పెద్ద తప్పు చేస్తోందని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన హెచ్చరించారు. దేశం దాని సామర్థ్యాన్ని చేరుకునేందుకు నిర్మాణాత్మక సమస్యలు పరిష్కరించాలని అన్నారు. Also Read: కవితకు ఖైదీ నంబర్ 666..డల్‌గా మొదటిరోజు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అతిపెద్ద సవాలు విద్యా వ్యవస్థ, శ్రామికుల నైపుణ్యాలను మెరుగుపర్చడమే అని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించకుంటే యువత ప్రయోజనాలను కాపాడే విషయంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాలో సగానికి పైగా 30 ఏళ్ల లోపు యువతీ, యువకులే ఉన్నారని తెలిపారు. అలా మాట్లాడమే శూన్యం అలాగే 2047 నాటికి ఇండియా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ దేశంగా మార్చాలన్న ప్రధాని మోదీ ఆశయాన్ని మాజీ గవర్నర్ రఘురామ్ కొట్టిపారేశారు. పాఠశాలల్లో డ్రాప్ అవుట్ శాతం ఎక్కవగా ఉండి.. పిల్లలకు హైస్కూల్ విద్య అందకపోతే ఈ ఆశయం గురించి మాట్లాడమే శూన్యమని అన్నారు. ఇండియాలో అక్షరాస్యత రేటు వియత్నాం వంటి ఇతర ఆసియా దేశాల కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తుచేశారు. Also Read: జర ఆగు హన్మంతన్నా.. వీహెచ్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇదే! అది కరెక్ట్ కాదు దేశంలో 8 శాతం స్థిరమైన వృద్ధిని సాధించేందుకే భారత్ మరింత ఎక్కువగా పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే దేశంలో ఉన్న విద్య కంటే చిప్‌ల తయారీకి రాయితీల కోసం ఎక్కువగా ఖర్చు చేసేలా మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను ఆయన తప్పుపట్టారు. ఇండియాలో సెమీ కండక్టర్ కంపెనీలకు.. కార్యకలాపాలు స్థాపించేందుకు రాయితీల కింద రూ.76 వేల కోట్లు కేటాయించగా.. విద్య కోసం కేవలం రూ.47 వేల కోట్లు కేటాయించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. #telugu-news #national-news #loksabha-elections #raghuram-rajan #education-in-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి