French Open 2024 : టెన్నిస్ స్టార్ ప్లేయర్ (Tennis Star Player),14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ ఛాంపియన్ రఫెల్ నదాల్ (Rafael Nadal) కు ఊహించని పరాభవం ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్‌లో జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో ఓటమిపాలైన నాదల్ తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్ర్కమించాడు.
There are no words. Merci, Rafa 🫶#RolandGarros @RafaelNadal pic.twitter.com/znj0j42Qbf
— Roland-Garros (@rolandgarros) May 27, 2024
జ్వెరెవ్ స్పష్టమైన ఆధిపత్యం..
ఈ మేరకు మూడు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి రౌండ్‌లోనే నదాల్‌ను 3-6, 6-7(5-7), 3-6 తేడాతో జ్వెరెవ్ ఓడించాడు. రెండో సెట్‌లో నదాల్ గట్టి పోటీనిచ్చినా ఓటమి తప్పలేదు. జ్వెరెవ్ చేతిలో నదాల్ వరుసగా మూడు సెట్లు కోల్పోయాడు. నదాల్ 3 డబుల్ ఫౌల్ట్స్, 30 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. జ్వెరెవ్ 8 ఏస్‌లు, 44 విన్నర్లు బాదితే.. నదాల్ కేవలం 2 ఏస్‌లు, 34 విన్నర్లు కొట్టాడు. జకోవిచ్, రాబిన్ సొడెర్లింగ్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో నదాల్‌ను ఓడించిన మూడో ప్లేయర్‌గా జ్వెరెవ్ నిలిచాడు.
14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్..
ఇక 22 గ్రాండ్‌స్లామ్స్ విజేత 37 ఏళ్ల నదాల్ తన కెరీర్‌లో ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి. 14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నదాల్.. చివరిసారిగా 2022లో విజేతగా నిలిచాడు. మరోవైపు, 2వ సీడ్ సిన్నర్(ఇటలీ), 9వ సీడ్ సిట్సిపాన్(గ్రీస్) తొలి రౌండ్‌లో శుభారంభం చేసి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. అలాగే ఉమెన్స్ సింగిల్స్ (Women's Single) లో వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్(Poland) శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో స్వైటెక్ 6-1, 6-2 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన లియోలియా జీన్జీన్‌పై విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌ను స్వైటెక్ కేవలం గంటలోనే సొంతం చేసుకుంది. రెండో రౌండ్‌లో ఆమె జపాన్ క్రీడాకారిణి నవోమి ఒసాకాతో తలపడనుంది.
Also Read : ఆయిల్ ట్యాంకర్, గ్యాస్ సిలిండర్ల లారీ ఢీ.. ఊపిరాడక అల్లాడుతున్న జనం!