Current Bill: విద్యుత్‌ బిల్లుల చెల్లింపులో క్యూ ఆర్‌ కోడ్‌ విధానం!

తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ బిల్లు చెల్లింపుల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకుని వచ్చింది. ఇక నుంచి విద్యుత్‌ బిల్లు చెల్లించాలంటే..క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని తీసుకొచ్చింది.ఇళ్లలో మీటర్ల నుంచి రీడింగ్‌ తీశాక వచ్చే బిల్లు కిందే క్యూ ఆర్‌ కోడ్‌ ముద్రించి ఉంటుంది.

Current Bill: విద్యుత్‌ బిల్లుల చెల్లింపులో క్యూ ఆర్‌ కోడ్‌ విధానం!
New Update

TGSPDCL: తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ బిల్లు చెల్లింపుల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకుని వచ్చింది. ఇక నుంచి విద్యుత్‌ బిల్లు చెల్లించాలంటే..క్యూఆర్‌ కోడ్‌ (QR Code) విధానాన్ని తీసుకొచ్చింది. ఇళ్లలో మీటర్ల నుంచి రీడింగ్‌ తీశాక వచ్చే బిల్లు కిందే క్యూ ఆర్‌ కోడ్‌ ముద్రించి ఉంటుంది.

వినియోగదారులు తమ మొబైల్‌ ఫోన్‌ ద్వారా దీన్ని స్కాన్‌ చేసి డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్‌ తదితర విధానాల్లో బిల్లును చెల్లించే వెసులుబాటు ఉండనుందని అధికారులు వివరించారు. ఎన్పీడీసీఎల్‌ ముందు పైలట్‌ ప్రాజెక్టుగా కొన్ని విద్యుత్‌ , రెవెన్యూ కార్యాలయాల పరిధిలో ముందుగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.

దశల వారీగా డిస్కం పరిధిలోని అన్ని జిల్లాల్లో క్యూ ఆర్‌ కోడ్‌ బిల్లులు రానున్నాయని అధికారులు తెలిపారు.

Also Read: కాంగ్రెస్‌ నేత ఇంట్లో చేతబడి వస్తువులు!

#telangana #qr-code #current-bill
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి