Naaz Center - Guntur : స్టార్ నటుడు ప్రభాస్ ఫ్యాన్స్(Prabhas Fans) కు బిగ్ షాక్ ఇచ్చారు థియేటర్ యాజమాన్యం. ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అయితే పూర్తి యాక్షన్ మూవీగా రూపొందించిన సినిమాపై పలు చోట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న పిల్లలతో సినిమా చూడాలంటే ఇబ్బందిగా ఉందని, కొన్ని సన్నివేశాలు భయబ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయంటూ పలువురు పేరెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గుంటూర్ లోని ఓ థియేటర్ ప్రేక్షకులను కొత్త రూల్ పెట్టింది.
ఈ మేరకు గుంటూరు నాజ్ సెంటర్ లోని పీవీఆర్ థియేటర్ 18 ఏళ్లు దాటిన వారిని మాత్రమే హాల్ లోకి అనుమతిస్తుంది. కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులను లోనికి రానివ్వట్లేదు. చిన్న పిల్లలు సినిమా చూసేందుకు వీలు లేదని, కలవరపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు థియేటర్ యాజమాన్యం తెలిపింది. అయితే ముందే బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని థియేటర్ సిబ్బందిని నిలదీశారు. దానికి థియేటర్ సిబ్బంది ఒప్పుకోకపోవడంతో కొంతమంది నిరసనకు దిగారు.
ఇది కూడా చదవండి : ఆ సమయంలో అర్ధరాత్రి ఒంటరిగా తిరిగేదాన్ని.. కత్రినా కైఫ్
దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు పీవీఆర్(PVR) థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అన్ లైన్ టికెట్ బుకింగ్ సమయంలోనే 18 ఏళ్ల నిబంధనను ఎందుకు స్పష్టంగా పేర్కొనలేదని పోలీసుల ఎదుటే థియేటర్ సిబ్బందిని ప్రేక్షకులు ప్రశ్నించారు. దీంతో వారం రోజుల్లో తమ డబ్బులు తిరిగి అకౌంట్లలో పడేలా చూస్తామని థియేటర్ యాజమాన్యం హామీ ఇచ్చింది. దీంతో ఇష్యూ ముగిసింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. నిజంగానే యాక్షన్ సన్నివేశాల కారణంగా ఈ రూల్ పెట్టారా? లేదా ఇంకేదైన కారణాలున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.