ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ వయసువారికి థియేటర్ లోకి నో ఎంట్రీ
ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్. గుంటూరు నాజ్ సెంటర్ లోని పీవీఆర్ థియేటర్ 18 ఏళ్లు దాటిన వారిని మాత్రమే హాల్ లోకి అనుమతిస్తుంది. దీంతో ముందే బుక్ చేసుకున్న ప్రేక్షకులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని థియేటర్ సిబ్బందిని నిలదీశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.