Paris Olympics: మరో పతకమే లక్ష్యం-పీవీ సింధు ఇప్పటికే రెండు ఒలింపిక్ పతకాలతో అగ్రస్థానంలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మరో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. రియోలో రజతం, టోక్యోలో కాంస్యం నెగ్గిన ఈ సీనియర్ షట్లర్ మూడో పతకం కోసం గత కొన్నాళ్లుగా విపరీతమైన ప్రాక్టీస్ చేస్తోంది. By Manogna alamuru 27 Jul 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి P. V. Sindhu: హ్యాట్రిక్ ఒలింపిక్ మెడల్ కోసం పీవీ సింధు సర్వం సిద్ధం అయింది. పారిస్‌లో తన కలను సాకారం చేసుకునేందుకు కఠోర ప్రాక్టీసు చేసింది. ఇప్పటివరకు భారత ఒలింపిక్ చరిత్రలో ఏ క్రీడాకారుడు, కారిణి మూడు మెడల్స్ సాధించిన దాఖలాలు లేవు. ఇప్పుడు పీవీ సింధు కనుక పతకం సాధిస్తే అది చాలా పెద్ద రికార్డ్ అవుతుంది. పీవీ సింధు కూడా అదే తన లక్ష్యమని చెబుతోంది. అయితే తనమీద ఏమీ ఒత్తిడి లేదని అంటోంది. ఎప్పుడు ఎక్కడ బరిలోకి దిగినా అదే కొత్త అన్నట్టు ఉంటాను. ఇప్పుడు కూడా అలాగే ఆడానని చెబుతోంది. పారిస్‌కు వచ్చేముందు చివరగా ఆమె జర్మనీలోని సార్ బ్రుకెన్‌లో తుది సన్నాహాలు చేసింది. పారిస్‌లాంటి వాతావరణ పరిస్థితులు సార్‌బ్రుకెన్‌లోనూ ఉండటం వల్ల సింధు స్థానిక పరిస్థితుల్ని ఆకలింపు చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ప్రాక్టీస్ వేదికను ఎంచుకుంది. పారిస్ ఒలింపిక్స్ కోసం పీవీ సింధు సీనిమర్ మోస్ట్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పడుకోన్ ద్గర కూడా శిక్షణ తీసుకుంది. కచ్చితమైన స్ట్రోక్స్ నేర్చుకుంది. ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో సుదీర్ఘ ర్యాలీలు ఎక్కువగా జరుగుతున్నాయి. మ్యాచ్‌లు కూడా చాలా సేపు జరుగుతుండటంతో ఆ దిశగా నేను కసరత్తు చేశాను. ఇప్పుడు ర్యాలీలు ఎంతసేపు సాగినా ఏ ఇబ్బంది లేదు. ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నాను అని సింధు చెప్పింది. Also Read:Paris Olympics: ఒలింపిక్స్ పరేడ్‌లో మెరిసిన భారత జెండా #2024-paris-olympics #pv-sindhu #badminton మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి