Paris Olympics: ఒలింపిక్స్‌ నుంచి పివి సింధు అవుట్

పారిస్ ఒలింపిక్స్ లో పతకం ఖాయం అనుకున్న బ్యాడ్మింటన్‌లో నిరాశ ఎదురైంది. స్టార్ బ్యాడ్మింట్ ప్లేయర్ పీ.వి సింధు 16వ రౌండ్‌లో ఓటమి పాలయింది. దీంతో ఆమె మహిళల బ్యాడ్మింటన్ సింగిల్ నుంచి వైదొలిగింది.

New Update
Paris Olympics: ఒలింపిక్స్‌ నుంచి పివి సింధు అవుట్

Badminton Player PV Sindhu: బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగల్స్ లో భారత షట్లర్ పీవీ సింధు ప్రయాణం ముగిసింది. ప్రీక్వార్టర్స్‌లో ఆమె ఓటమి పాలయ్యింది. చైనాకు చెందిన హీ బింగ్‌తో జరిగిన హోరాహోరీ పోరులో సింధు గెలవలేకపోయింది. మ్యాచ్ మొదలన దగ్గర నుచే చైనా క్రీడాకారిణి ధిపత్యం ప్రదర్శించింది. మరోవైపు సింధు ఒక్కో పాయింట్‌ను కష్టపడ సాధించాల్సి వచ్చింది. ఫస్ట్ రౌండ్ లో 19-21 తేడాతో వెనుకబడింది. ఆ తర్వాత సెట్‌లో కూడా సింధు 14-21 తేడాతో ఓపోయింది. దీంతో ఆమె ఇంటిబాట పట్టాల్సి వచ్చింది.

అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ ఎస్టోనియా క్రీడాకారిణి క్రిస్టిన్ కూబా మనిసిని ఓడించి తదుపరి స్థాయికి దూసుకెళ్లింది. ఆరంభం నుంచి చక్కటి నియంత్రణను ప్రదర్శించిన సింధు.. తొలి సెట్ లోనే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలమైంది. దీంతో ఆమె ఏకపక్షంగా 21-9 పాయింట్ల తేడాతో మొదటి సెట్‌ను గెలుచుకుంది.

మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ఎస్టోనియా క్రీడాకారిణి క్రిస్టిన్ కూబా మనిసిని ఓడించి తదుపరి స్థాయికి దూసుకెళ్లింది. ఆరంభం నుంచి చక్కటి నియంత్రణను ప్రదర్శించిన సింధు.. తొలి సెట్ లోనే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలమైంది. దీంతో ఆమె ఏకపక్షంగా 21-9 పాయింట్ల తేడాతో మొదటి సెట్‌ను గెలుచుకుంది. రెండో సెట్‌లో కూడా 21-10 పాయింట్ల తేడాతో రెండో సెట్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో పీవీ సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.

గత రెండు ఒలింపిక్స్‌లో భారత కీర్తిని ఆమె చాటి చెప్పింది. 2016లో రియో ​​ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కాబట్టి ఈసారి కూడా పీవీ సింధు నుంచి పతకం ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆమె ప్రదర్శన కూడా ఉంది.

పివి సింధు విజయాలు:

2013 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లు (World Badminton Championships) (గ్వాంగ్‌జౌ, చైనా) – కాంస్యం
2014 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ (డెన్మార్క్) – కాంస్యం
2014 కామన్వెల్త్ గేమ్స్ (స్కాట్లాండ్) – కాంస్యం
2014 ఆసియా ఛాంపియన్‌షిప్స్ (దక్షిణ కొరియా) – కాంస్యం
2016 రియో ​​ఒలింపిక్స్ 2016 (బ్రెజిల్)- రజతం
2017 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ (స్కాట్లాండ్) – రజతం
2018 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ (చైనా) – రజతం
2018 కామన్వెల్త్ గేమ్స్ (ఆస్ట్రేలియా) – రజతం
2018 ఆసియా క్రీడలు (ఇండోనేషియా) – రజతం
2019 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ (స్విట్జర్లాండ్) – స్వర్ణం
2022 కామన్వెల్త్ గేమ్స్ (ఇంగ్లండ్) – స్వర్ణం

Advertisment
తాజా కథనాలు