Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై కాల్పుల విరమణ చేస్తామన్న పుతిన్.. కానీ

జీ7 దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన నేపథ్యంలో నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌కు కాల్పుల విరమణ చేస్తామని ఆఫర్‌ ఇచ్చారు. కానీ తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో ఉక్రెయిన్ బలగాలు వెళ్లిపోవాలని, నాటోలో కూడా ఉక్రెయిన్ చేరొద్దని షరతు పెట్టారు.

New Update
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై కాల్పుల విరమణ చేస్తామన్న పుతిన్.. కానీ

2022లో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఇంకా ముగిసిపోలేదు. ఇప్పటికీ ఆ దేశాల్లో ఎక్కడో ఓ చోట బాంబుల మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో కూడా.. ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి రూ.4.17 లక్షల కోట్లు (5 వేల కోట్ల డాలర్లు) రుణ ప్యాకేజీని ఇవ్వాలని తీర్మానించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణకు ఆదేశిస్తానంటూ ఉక్రెయిన్‌కు ఆఫర్ ఇచ్చారు. కానీ ఇందుకు రెండు షరతులు పెట్టారు.

Also Read: బ్యాంకు ఉద్యోగులకు షాక్.. తప్పుడు పని చేసినందుకు ఊడిన జాబ్స్‌

రష్యా విదేశాంగ శాఖ కార్యాలంలో పుతిన్ మాట్లాడారు. మేం వెంటనే కాల్పుల విరమణ చేస్తామని.. అలాగే చర్చలు కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. యుద్ధం సమయంలో తాము స్వాధీనం చేసుకున్న నాలుగు ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే నాటోలో చేరాలన్న ఆలోచనను కూడా ఉక్రెయిన్ విరమించుకోవాలంటూ షరతు విధించారు. తుది పరిష్కారం కోసమే ఈ ప్రతిపాదన తెచ్చామని.. ఎలాంటి ఆలస్యం చేయకుండా చర్చలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

ఇదిలాఉండగా.. ఉక్రెయిన్‌కు చెందిన దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియా ప్రాంతాలు తమ దేశంలో విలీనమయ్యాయని గతంలోనే రష్యా ప్రకటించింది. కానీ రష్యా చర్యలను ఉక్రెయిన్‌తో సహా పశ్చిమ దేశాలు ఖండించాయి. రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న ఆ నాలుగు ప్రాంతాలతో పాటు 2014లో ఆక్రమించుకున్న క్రిమియాను వదలివెళ్లిపోవాలని మరోవైపు ఉక్రెయిన్‌ డిమాండ్ చేస్తోంది. అయితే ప్రస్తుతం నాటోలో చేరేందుకు ఉక్రెయిన్‌ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో.. రష్యా విధించిన షరతులకు ఉక్రెయిన్‌ అంగీకరించే అవకాశం లేదని తెలుస్తోంది.

Also Read: కువైట్‌లో భారతీయ కార్మికులు చేసే ఉద్యోగాల గురించి వెల్లడించిన కేంద్ర రాయబార కార్యాలయం!

Advertisment
తాజా కథనాలు