Alexie Navalny: నావల్నిని ఆ పద్దతి ద్వారా హత్య చేసి ఉండొచ్చు: ఒసెచ్కిన్‌

రష్యా విపక్ష నేత నావల్ని మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే ఆయనకి కేజీబీ ఉపయోగించే టెక్నిక్‌తో.. గుండెపై గట్టిగా పంచ్ ఇచ్చి హత్య చేసి ఉండొచ్చని మానవ హక్కుల కార్యకర్త వ్లాదిమిర్‌ ఒసెచ్కిన్‌ ఆరోపించారు.

New Update
Alexie Navalny: నావల్నిని ఆ పద్దతి ద్వారా హత్య చేసి ఉండొచ్చు: ఒసెచ్కిన్‌

ఇటీవల రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్ని సైబీరియన్‌ పీనల్ కాలనీ జైలులో అనుమానస్పద రీతిగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన ఎలా చనిపోయారనే విషయం ఇంకా ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. నావల్నీని.. రష్యా అధ్యక్షుడు పుతిన్ హత్య చేయించాడని ఆరోణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మానవ హక్కుల కార్యకర్త వ్లాదిమిర్‌ ఒసెచ్కిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నావల్నీని కేజీబీ ఉపయోగించే ఒక సిగ్నేచర్‌ టెక్నిక్‌తో హత్య చేసినట్లు ఆరోపణలు చేశారు. ఆయన గండెపై ఓ పంచ్‌ విసరడం వల్ల మృతి చెంది ఉండొచ్చని అన్నారు.

Also Read: రష్యా-ఉక్రెయిన్ వార్‌లో భారత యువకుడి మృతి

అయితే కేజీబీ అనేది ఓ ప్రభుత్వ సంస్థ. సోవియట్ కాలం నాటి అంతర్గత భద్రతా సేవగా దీన్ని అభివర్ణిస్తారు. దీన్ని 1991, డిసెంబర్ 3న అధికారికంగా రద్దు చేశారు. ఆ తర్వాత రష్యాలో ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌గా, అనంతరం ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB)గా మారింది. అప్పట్లో కేజీబీ ఏజెంట్లకు ఒక వ్యక్తి గుండెపై గట్టిగా కొట్టి ఎలా చంపాలి అనే దానిపై ట్రైనింగ్ ఇస్తుండేవారని ఒసెచ్కిన్ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు నావల్నీని చంపేందుకు కూడా ఇలాంటి పద్దతినే ఉపయోగించి ఉంటారని ఆయన అరోణలు చేశారు.

Also Read: ‘పెళ్లి చేస్తేనే చదువుకుంటా..’ ఆమెకు 12, అతనికి 13.. వీడియో వైరల్!

నావల్ని శరీరాన్ని బలహీన పరిచేందుకు చల్లని ఉష్ణోగ్రతలో గంటల తరబడి నిలబెట్టి ఉంటారని.. దీంతో అతడి రక్త ప్రసరణ కనిష్ట స్థాయికి తగ్గించి మొదటగా శరీరాన్ని నాశనం చేసి ఉంటారని భావిస్తున్నానని ఒసెచ్కిన్ అన్నారు. ఆ తర్వాత కేజీపీ పద్దతితో గుండెపై ఒక పంచ్ ఇచ్చి హత్య చేసి ఉంటారని ఆరోపణలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు