Putin : రష్యాలో మార్చిలో ఎన్నికలు.. పుతిన్ పోటీ చేస్తారా..?

రష్యా ఎన్నికలను వచ్చే ఏడాది మార్చి 17న నిర్వహించాలని అక్కడి చట్ట సభ్యులు నిర్ణయించారు. అయితే ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (71) తెలిపారు. పుతిన్‌ రాబోయే ఎన్నికల్లో కూడా గెలవడం కాయమని అక్కడివారు భావిస్తున్నారు.

Russia Elections: ఎన్నిసార్లు మీరే అవుతారు మావా.. మరోసారి పుతినే ప్రెసిడెంట్‌!
New Update

Russia Elections March 2024 : రష్యా(Russia) అధ్యక్ష ఎన్నికలకు నగారా మోగింది. 2024 మార్చి 17న ఎలక్షన్స్ నిర్వహించేందుకు రష్యా ఎగువసభ ఫెడరేషన్ కౌన్సిల్ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) (71) ప్రకటించారు. అయితే ఆయన పదవీకాలం 2024లో ముగియాల్సి ఉంది. కానీ గతంలో పుతిన్ తెచ్చిన రాజ్యాంగ సంస్కరణల వల్ల 2024 తర్వాత మరో రెండు పర్యాయలు అంటే 2036 వరకు అధికారంలో కొనసాగేందుకు వీలుంటుంది. అయితే రాజకీయ అధికార యంత్రాంగంపై పూర్తి స్థాయిలో పుతిన్‌ రాబోయే ఎన్నికల్లో కూడా గెలవడం కాయమని అక్కడివారు భావిస్తున్నారు. మరో విషయం ఏంటంటే ఆయన ప్రత్యర్థులగా భావిస్తున్న వాళ్లు జైళ్లలో, విదేశాల్లో ఉండిపోయారు.

Also Read: కేసీఆర్ కు సర్జరీ సక్సెస్..

ప్రస్తుతం రష్యాలో స్వతంత్ర మీడియా సంస్థలపై నిషేధం, నియంత్రణలు కొనసాగుతున్న తరుణంలో పుతిన్‌కు పోటీగా ఎవరు నిలుస్తారు అనే విషయం ఇంకా అధికారికంగా బయటపడలేదు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు మాస్కో ప్రంత మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు బోరిస్ నదేజ్దిన్, జర్నలిస్ట్ లాయర్ అయిన యక్తెరినా దుంట్‌సోవా ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాదికి పైగా ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం, అలాగే ప్రైవేటు సైన్యాధిపతి యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ తిరుగుబాటు విఫలం కావడం వంటివి పుతిన్ ప్రజాదరణపై పెద్దగా ప్రభావం చూపవని పరిశీలకులు చెబుతున్నారు.

Also Read: ఈ రాజీనామా నా ఎంపీ పదవికి మాత్రమే.. సీఎం రేవంత్ ఎమోషనల్ ట్వీట్!

#russia-elections-2024 #telugu-news #russia #vladimir-putin
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe