/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-17T204922.596.jpg)
Pushpa 2 Release Date: అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప 2 సినిమా వాయిదా పడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటం వల్ల ఆగస్టు 15న విడుదల చేయలేకపోతున్నామని ప్రకటించింది.
— Pushpa (@PushpaMovie) June 17, 2024
Also Read: మిస్టర్ బచ్చన్ ‘షో రీల్’.. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్
ఇదిలాఉండగా పుష్ప పార్ట్ 1 పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు కూడా దక్కింది. ఇప్పటికే పుష్ప -2 సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తొలుత ఆగస్టు 15న చిత్రం విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా చేయాల్సిన పనలు పెండింగ్‌లో ఉండటం వల్ల విడుదల తేదీ వాయిదా పడటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
#Pushpa2TheRule in cinemas from December 6th, 2024. pic.twitter.com/BySX31G1tl
— Allu Arjun (@alluarjun) June 17, 2024
Also read: ‘కల్కి’ ‘భైరవ ఆంథమ్’ ఫుల్ వీడియో వచ్చేసింది.. పంజాబీ స్టైల్ లో ప్రభాస్ కుమ్మేసాడు!