Mr Bachchan: హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ఇటీవలే మూవీ షూట్ పూర్తయిన సందర్భంగా.. సినిమా ప్రమోషనల్ కంటెంట్ లో భాగంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రతీ సినిమాలా టీజర్, గ్లిమ్ప్స్ కాకుండా వెరైటీగా 'షో రీల్' ఒకటి రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ఈ షో రీల్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. డైలాగ్స్ ఏమీ లేకుండా కేవలం యాక్షన్ సన్నివేశాలతో సాగిన ఈ 'షో రీల్' పవర్ ఫుల్ గా కనిపించింది. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
#MrBachchan - Naam Tho Suna Hoga...
Ab aadmi ko dekh lo 🔥#MrBachchanShowreel out now ❤️🔥
▶️ https://t.co/xpgQluRNYF#MassReunion
Mass Maharaaj @RaviTeja_offl @harish2you @IamJagguBhai @vishwaprasadtg @peoplemediafcy @TSeries @PanoramaMovies @vivekkuchibotla #KrithiPrasad… pic.twitter.com/wwAYgRkzgw— People Media Factory (@peoplemediafcy) June 17, 2024
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. సీనియర్ నటుడు జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మిక్కీ మేయర్ సంగీతం అందిస్తున్నారు.