Pushpa 2 Tittle Song : అక్కడ ఐకాన్ స్టార్ రా బాబూ.. టీ స్టెప్ వేయబోయిన ఫ్యాన్ కు ఏం జరిగిందో చూడండి! 'పుష్ప 2' టైటిల్ సాంగ్ లో అల్లు అర్జున్ టీ కప్ తో వేసే ఓ మూమెంట్ ని ఓ నెటిజన్ రీ క్రియేట్ చేసుందుకు ట్రై చేసి టీ ని గోడకి ఒలకపోశాడు. దానికి వాళ్ళ అమ్మ 'తగ్గేదేలే' అనే మ్యానరిజాన్ని వాడుతూ అతన్ని కొడుతున్న ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. By Anil Kumar 04 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Pushpa 2 Tittle Song Funny Video : ప్రెజెంట్ సోషల్ మీడియా(Social Media) లో 'పుష్ప 2' మ్యానియా నడుస్తోంది. మొన్న 'పుష్ప 2'(Pushpa 2) నుంచి టైటిల్ సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే కదా. ఈ సాంగ్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. సాంగ్ కి దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) ఇచ్చిన మ్యూజిక్, దానికి బన్ని డ్యాన్స్ మెయిన్ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ పాటలో బన్నీ వేసిన కొన్ని స్టెప్స్ ని నెటిజన్స్ సోషల్ మీడియాలో ఫన్నీగా రీ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సాంగ్ లో అల్లు అర్జున్(Allu Arjun) టీ కప్ తో వేసే ఓ మూమెంట్ ని నెటిజన్స్ రీల్స్ రూపంలో రీ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అదే స్టెప్ ని రీ క్రియేట్ చేసుందుకు ట్రై చేసి టీ ని గోడకి ఒలకపోశాడు. Orei 🤣🤣🤣🤣😭😭😭#PushpaPushpa @alluarjun pic.twitter.com/wLEKAC6zwn — Hemanth Kiara (@ursHemanthRKO) May 3, 2024 Also Read : ప్లాప్ హీరోతో జత కట్టనున్న సంయుక్త మీనన్? దానికి వాళ్ళ అమ్మ 'తగ్గేదేలే' అనే మ్యానరిజాన్ని వాడుతూ అతన్ని కొడుతున్న ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియోని చుసిన బన్ని ఫ్యాన్స్.." ఆ స్టెప్ ఓన్లీ మా అల్లు అర్జున్ కు మాత్రమే సాధ్యమవుతుందని, ఎవరి వల్ల కాదని", అంతే ఫన్నీగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక 'పుష్ప 2' టైటిల్ సాంగ్ విషయానికొస్తే.. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాటను ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రచించగా.. నకష్ అజీజ్, దీపక్ బ్లూ ఆలపించారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు. మే 1 న రిలీజ్ అయిన ఈ పాట యూట్యూబ్ లో ఇప్పటికే 21 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి ఇప్పటికీ ట్రిండింగ్ వన్ లో దూసుకుపోతుంది. #social-media #pushpa-2 #devi-sri-prasad #pushpa-2-tittle-song మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి