/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-19T153443.752-jpg.webp)
Pushpa 2 OTT Release: స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప 2. పుష్ప పార్ట్ 1 సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతుంది. 2021 లో రిలీజైన పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2024 లో విడుదల కాబోతున్న పుష్ప 2 పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే చిత్ర బృందం.. సినిమా పోస్ట్ పోన్ అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ రిలీజ్ డేట్ పై మరో సారి క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా 2024 ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన అల్లు అర్జున్ స్పెషల్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ కు ముందే సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ మూవీ మరింత ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.
Also Read: Ranbir, Bobby Deol: రాముడిగా రణబీర్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్.. మరో సారి కాంబో రిపీట్
పుష్ప 2 ఓటీటీ పార్ట్ నర్
ఇక తాజాగా రిలీజ్ కు ముందే పుష్ప 2 ఓటీటీ ఒప్పందం కూడా జరిగిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అప్డేట్ రిలీజ్ చేసింది. థియేట్రికల్ రన్ తర్వాత నెట్ ఫ్లిక్స్ వేదికగా పుష్ప 2 స్ట్రీమ్ అవ్వనున్నట్లు తెలిపింది. 100 కోట్ల బడ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ హక్కులను సొంత చేసుకున్నట్లుసమాచారం. అయితే ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చ జరగగా.. భారీ బడ్జెట్ చెల్లించడానికి ఆసక్తి చూపించలేదని టాక్.
పుష్ప 2 థియేట్రికల్ రన్ తర్వాత హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకొస్తామని నెట్ ఫ్లిక్స్ సంస్థ ట్వీట్ చేసింది. "హ్యాష్ ట్యాగ్ నెట్ ఫ్లిక్స్ పండగ" అంటూ ఈ అప్డేట్ ను రిలీజ్ చేసింది. దీంతో బన్నీ అభిమానుల్లో సినిమా పై ఆసక్తి మరింతపెరిగిపోయింది.
Pushpa is about to come out of hiding and he's coming to RULE! 🌹🔥#Pushpa2: The rule is coming soon on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada, Hindi as a post theatrical release! #NetflixPandaga pic.twitter.com/HEYs7Sh7ZK
— Netflix India South (@Netflix_INSouth) January 15, 2024
Also Read: Oscar Awards: 2024 ఆస్కార్ నామినేషన్స్ లో మరో తెలుగు సినిమా.. ఏంటో తెలుసా..?