Allu Arjun: బన్నీకి ఆరోగ్యం బాలేదు..అందుకే పుష్ప 2 కి బ్రేక్‌!

అల్లు అర్జున్‌ వెన్ను నొప్పితో బాధపడుతుండటం వల్ల పుష్ప 2 సినిమా షూటింగ్‌ వాయిదా పడినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.

HBD Allu Arjun: ''అల్లు'' వారి విల్లు... నట మత్స్య యంత్రాన్ని చేధించిన ''అర్జును''డికి హ్యాపీ బర్త్‌ డే!
New Update

టాలీవుడ్‌ మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది పుష్ప 2 అనే చెప్పవచ్చు. అల్లు అర్జున్‌ ని జాతీయ నటుడిగా నిలబెట్టిన సినిమా..పుష్ప. ఇప్పుడు దానికి కొనసాగింపుగా పుష్ప 2 ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ ఎప్పుడో తెలిపారు. చెప్పినట్లుగానే పుష్ప 2 సినిమా షూటింగ్ ని ఎప్పుడో మొదలు పెట్టేశాడు కూడా.

ఇప్పటికే సినిమా నుంచి కొన్ని ఆసక్తికర సన్నివేశాలను అభిమానుల కోసం విడుదల కూడా చేసింది చిత్ర బృందం. పుష్ప ని మించి పుష్ప 2 ఉంటుందని ఆ పోస్టర్లు చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అయిపోతుంది. దీంతో పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే..తాజాగా పుష్ప 2 సినిమా షూటింగ్‌ కి బ్రేక్‌ పడినట్లు తెలుస్తుంది. దానికి కారణం అల్లు అర్జున్‌.ఎందుకంటే బన్నీకి తీవ్రమైన వెన్నునొప్పి రావడం వల్ల సినిమా షూటింగ్‌ ని వాయిదా వేసినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా షెడ్యూల్ మొదలు పెట్టిన సుకుమార్‌...రామోజీ ఫిలిం సిటీలో బన్నీతో యాక్షన్‌ సీక్వెన్స్‌ చేయిస్తున్న సంగతి తెలిసిందే.

బన్నీకి వెన్ను నొప్పి రావడం వల్ల చిత్ర నిర్మాణాన్ని డిసెంబర్‌ రెండో వారానికి వాయిదా వేసినట్లు చిత్ర బృందం తెలిపింది. బన్నీ రష్మిక మీద ముఖ్యమైన సన్నివేశాన్ని నిర్మిస్తున్న సమయంలో బన్నీకి వెన్ను నొప్పి రావడం వల్ల దీనిని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

Also read: రెండు స్థానాల్లో విజయం దిశగా రేవంత్.. కామారెడ్డిలో కేసీఆర్ కు థర్డ్ ప్లేస్!

#allu-arjun #rashmika #pushpa-2 #sukumar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe