'Double Ismart' సినిమాకు సంచలన మ్యూజిక్ డైరెక్టర్.. ఎవరో తెలుసా..!

డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'Double Ismart' సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. సినిమా నిర్మాతలు దానిపై ఒక క్లారిటీ ఇచ్చారు.

New Update
'Double Ismart' సినిమాకు సంచలన మ్యూజిక్ డైరెక్టర్.. ఎవరో తెలుసా..!

Double ismart Music Director: తెలుగు చిత్ర పరిశ్రమలో పంచ్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అనగానే గుర్తొచ్చేది డైరెక్టర్ పూరిజగన్నాథ్. కథను తెరక్కేకించడంలో పూరిజగన్నాథ్ కు ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. తన సినిమాలలో కనిపించే ఆ మాస్ యాంగిల్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పుకోవచ్చు. హీరోలతో పోటీగా ఆయన అభిమానులను సంపాదించుకున్నారు అనటంలో అతిశయోక్తేమీ లేదు..

పూరిజగన్నాథ్(Puri Jagannadh) సినిమా అనగానే అభిమానులలో తెలియని ఒక ఉత్సాహం కలుగుతుంది. ఆయన సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎదురుచూసే వాళ్ళు కూడా ఉంటారు.

'Ismart Shankar' సినిమాతో మంచి కమర్షియల్ హిట్ కొట్టాడు. ఆ సినిమాలోని డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేశాయి. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల మోత మోగించింది.. 'Ismart Shankar' మూవీకి సీక్వెల్ గా డైరెక్టర్ పూరిజగన్నాథ్ 'Double Ismart' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే దానికి సంబందించిన పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

రిలీజ్ కు ముందే ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటూ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది.

గతంలో వచ్చిన 'Ismart Shankar' సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన మణిశర్మ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. మణిశర్మ(Mani Sharma) కెరియర్ కి కూడా మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ఇది.

మరి ఇప్పుడు రాబోతున్న'Double Ismart' సినిమాలో మణిశర్మ సంగీతం ఉంటుందా లేదా అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఈ సినిమాలో మణిశర్మ సంగీతం లేదన్న బజ్ వినిపించడంతో మణిశర్మ అభిమానులు కాస్త అసంతృప్తి చెందారు. కానీ ఈ వార్తలన్నిటికి చెక్ పెడుతూ సినిమా నిర్మాతలు మళ్లీ సంగీత దర్శకుడిగా మణిశర్మ నే డిసైడ్ చేశారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

భారీ అంచనాలతో తెరపైకి వస్తున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే అభిమానులలో ఒక హైప్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ దత్త్ (Sanjay Dutt) ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సంజయ్ దత్త్, హీరో రామ్ మధ్య మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
హాలీవుడ్ ప్రముఖ సినిమాటో గ్రాఫర్ Gianni Giannelli ఈ సినిమాకు సినిమాటో గ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. పూరిజగన్నాథ్, రామ్ (Ram Pothineni) కాంబినేషలో మాస్ యాక్షన్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: యాక్షన్ డ్రామాలో రామ్ సెట్ అయ్యాడా? స్కంద మూవీ రివ్యూ.

Advertisment
తాజా కథనాలు