Punganur: పుంగనూరు అంగల్లు అల్లర్ల కేసుపై నేడు హైకోర్టులో విచారణ..!!

చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన అల్లర్లపై నేడు ఏపీ హై కోర్టులో విచారణ జరగనుంది. పుంగనూరు అల్లర్లలో టీడీపీ నేతలు అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ భుమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ దమ్మలపాటి రమేష్ తో పాటు మరికొందరు టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి..తమపై నమోదు అయిన కేసులపై ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారించనుంది.

AP High Court:చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణను వాయిదా వేసిన హైకోర్టు
New Update

Punganur Angallu Case: చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వెళ్లినప్పుడు అక్కడ ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనల్లో చాలా మంది గాయపడ్డారు. ఈ ఘర్షణలకు చంద్రబాబు కారణమంటూ పలు కేసులు నమోదు అయ్యాయి. చంద్రబాబు తోపాటు 20 మంది టీడీపీ (TDP) నేతలపై పోలీసులు కేసులు పెట్ారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమం నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు అప్పట్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో ఘర్షణవాతావరణం నెలకొంది. ఈ కేసులో చంద్రబాబు, దేవినేనిఉమతోపాటు పలువురు టీడీపీ నేతలను ఏ1,ఏ2 గా పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంతో పుంగనూరు అంగళ్లు కేసుపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.

అయితే పుంగనూరులో జరిగిన అల్లర్ల సందర్భంగా నమోదు అయినా కేసుల్లో టీడీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హై కోర్టులో విచారణ జరగనుంది. పుంగనూరు అల్లర్లలో టీడీపీ నేతలు అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ భుమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ దమ్మలపాటి రమేష్ తో పాటు మరికొందరు టీడీపీ (TDP) నేతలపై కేసులు నమోదయ్యాయి..తమపై నమోదు అయిన కేసులపై ముందస్తు బెయిల్ టీడీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారించనుంది.

ఇది కూడా చదవండి:  ఐదంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం..!!

కాగా అటు సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన వేర్వేరు పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పుంగనూరు అంగళ్లు కేసులో ప్రభుత్వం దాఖలు చేసిసన పిటిషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల విషయంలో తాము కలగజేసుకోమని ధర్మాసనం స్పష్టం చేసింది. అంగళ్లు కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీం ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది.

కాగా రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ పై జస్టిస్‌ అనిరుద్ద బోస్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేది సుప్రీంకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. పుంగనూరు అంగళ్లు ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. సామాన్యులకు భద్రత కల్పించాల్సిన పోలీసులే..సాక్షులుగా ఎఫ్ఐఆర్ ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పోలీసు అధికారులు గాయపడ్డారని, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు దారుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పోలీసులే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పోలీసులే సాక్షులుగా ఉంటారా అంటూ సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.

ఇది కూడా చదవండి: నేడు కూడా ఏసీబీకోర్టులో కొనసాగనున్న వాదనలు

అయితే హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది కాబట్టి ఆ విషయంలో తాము జోక్యం చేసుకోడానికి ఏమీ లేదని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. అటు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు వేరు వేరు పిటషన్లను కూడా సుప్రీం కొట్టివేసింది.

ఇక అంగళ్లు ఘటనలో టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణ తర్వాత టీడీపీ నేతలకు బెయిల్‌ మంజూరు చేసింది హైకోర్టు. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏసీ సర్కార్ సుప్రీంకోర్టులో 6 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. తెలుగుదేశం నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, చల్లా రామచంద్రారెడ్డి అలియాస్‌ చల్లా బాబు, నల్లారి కిషోర్‌ కుమర్‌ రెడ్డిలకు మంజూరు చేసిన బెయిల్‌ రద్దు చేయాలని ఏపీ సర్కార్ ను కోరింది.

#ap #ap-high-court #punganuru-case #punganur-angallu-case #today-hearing #punganur-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe